Spongy Rasgulla: రసగుల్లా స్పాంజిలా రావాలంటే ఇలా చేసి చూడండి.. అచ్చం స్వీట్ షాప్‌లోనివాటిలా..
రసగుల్లా.. ఆ పేరు వింటేనే మనసు కరిగిపోతుంది.. స్పాంజిలా వుండే రసగుల్లా అంటే చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు..
రసగుల్లా..(rasgulla recipe) ఆ పేరు వింటేనే మనసు కరిగిపోతుంది.. స్పాంజిలా వుండే రసగుల్లా అంటే చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు టక్కున నోట్లో వేసుకుంటారు. భారతీయ వంటకాల్లో(Indian dish) రసగుల్లాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. పెళ్లి ఇల్లు, విందులు, పండుగ విందుల్లో రసగుల్లాకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. భోజనం చేస్తున్నప్పుడు పక్కన స్వీట్ ఉంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. స్వీట్ తినాలని తహతహలాడే వారికి రసగుల్లా ఉంటే మరింత ఆనందంగా ఉంటుంది. అయితే ఈ సూపర్-ఈజీ డెజర్ట్ రెసిపీని స్వీట్ హౌస్ నుంచి కాకుండా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇది చేయడం కూడా చాలా చాలా ఈజీ అని చెప్పాలి.. ఎందుకంటే ఇందులో కేవలం మూడు పదార్థాలను ఉపయోగించి రెడీ చేయవచ్చు. ఫటాఫట్ రసగుల్లా రిసిపిని సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. ఈ స్పాంజీ రసగుల్లాను ఎలా చేయాలో తెలుసుకుందాం..
పాలతో జున్ను చేయండి
ఒక పెద్ద పాత్రలో పాలు పోసి మీడియం వేడి మీద ఉంచండి. ఆ తర్వాత పాలను మరిగించండి. ఆ తర్వాత మంట తగ్గించండి. అందులో సగం నిమ్మకాయ రసాన్ని కలపండి. మీరు నిమ్మరసం కలిపిన సుమారు 2-3 నిమిషాల్లో పగిలిపోతాయి. మంటను ఆపివేసి, మిశ్రమాన్ని కొన్ని నిమిషాలు అలానే ఉంచండి. తద్వారా పాలు జున్నుగా మారుతుంది.
జున్ను వడకట్టండి
ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిపై జల్లెడ ఉంచండి. ఓ కాటన్ క్లాత్ తీసుకుని అందులో జున్నును నీటిని వడకట్టడండి. జున్నును సుమారు 15-20 నిమిషాలు అలా విడిగా పెట్టండి.
చిన్న బంతులుగా తయారు చేయండి
ఒక ప్లేట్‌లో జన్ను తీసి చేతులతో బాగా మెత్తగా గుండ్రగా చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి లేదా నూనెతో మీ చేతులకు గ్రీజు వేయండి. పిండి నుంచి చిన్న బంతులను విడదీసి.. చిన్న లడ్డులుగా తయారు చేసుకోండి.
చక్కెర మిశ్రమాన్ని సిద్ధం చేయండి
ఒక పాత్రలో 1 కప్పు చక్కెర, 2 కప్పుల నీరు ఉంచండి. బాగా కలపండి. చక్కెర పూర్తిగా కరిగిపోనివ్వండి. చక్కెర మిశ్రమాన్ని ఎక్కువసేపు ఉడికించవద్దు.. ఎందుకంటే సిరప్ చిక్కగా ఉండకూడదు. చక్కెర కరిగి, మిశ్రమం మరుగుడం ప్రారంభించిన తర్వాత దానిని ఉపయోగించవచ్చు. మీరు రుచి కోసం ఏలకులు కూడా జోడించవచ్చు.
చివరగా ఇలా..
షుగర్ జ్యూస్‌లో జున్ను ముద్దలను అందులో వేయండి. చక్కెర మిశ్రమంలో పూర్తిగా మునిగిపోయాయని నిర్ధారించుకోండి. మంటను మీడియం మీద ఉంచండి. ఆ రసగుల్లాలకు చెక్కర రసం పట్టిందన్న తర్వాత దించేయండి. రసగుల్లాలు మెత్తగా మారిన తర్వాత.. సర్వ్ చేసేందుకు రెడీగా పెట్టుకోండి.
సర్వ్ చేయడానికి సిద్ధం..
రసగుల్లాలు కాస్త చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచాలి. రసగుల్లాలు చల్లగా వడ్డిస్తే మరింత రుచిగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి: History of Chicken 65: యమ్మీ..యమ్మీ.. చికెన్ 65.. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..
Telangana BJP: బండెనక బండి కట్టి.. నియోజకవర్గాలకు దూరమవుతున్న ఆ కమలం నేతలు..