Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of Chicken 65: యమ్మీ..యమ్మీ.. చికెన్ 65.. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..

చికెన్ ప్రియులకు ఓ మంచి పసందైన టేస్టీ స్నాక్ వంటకం.. సాయింత్రం అలా సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లినప్పుడు చికెన్ 65ని లాగిస్తుంటే వచ్చే మజానే వేరుగా ఉంటుంది. కొంచెం స్పైసీగా..

History of Chicken 65: యమ్మీ..యమ్మీ.. చికెన్ 65.. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..
History Of Chicken 65
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 22, 2022 | 6:38 PM

చికెన్ (chicken) ప్రియులకు ఓ మంచి పసందైన టేస్టీ స్నాక్ వంటకం.. సాయింత్రం అలా సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లినప్పుడు చికెన్ 65(chicken 65)ని లాగిస్తుంటే వచ్చే మజానే వేరుగా ఉంటుంది. కొంచెం స్పైసీగా.. మరింత క్రిస్పీగా ఉండే ఈ టేస్టీ చికెన్ 65 తింటుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. చికెన్ లో చాలా వెరైటీలు ఉన్నాయి. వాటిలో చికెన్ 65 స్థానం మాత్రం చాలా ప్రత్యేకం. ఈ చికెన్ 65 ని తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇప్పటి వరకు మనం చాలా సార్లు.. ఈ చికెన్ 65 ని చాలా సార్లు తినే ఉంటాం. కానీ.. ఈ రెసిపీకి చికెన్ 65 అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా..? ఆ రెసిపీలో 65 అంటే ఏంటి..? దానికి చికెన్ 65 అని ఎందుకు పెట్టారో తెలుసుకుందామా..?

చాలా మంది చికెన్ ని 65 ముక్కలుగా కట్ చేస్తారు కాబట్టి ఆ పేరు పెట్టారని.. లేదంటే.. 65 రోజుల పాటు చికెన్ ని మారినేట్ చేశారు కాబట్టి.. ఆ పేరు పెట్టారని చాలా రకాలుగా అనుకుంటారు. కానీ.. అసలు నిజం అది కాదట. దానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో ద్వారా వివరించారు.

నాన్‌వెజ్ ప్రియులకు ఓ మంచి స్నాక్ ఐటెమ్.. సాయింత్రం అలా సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లినప్పుడు చికెన్ 65ని లాగిస్తుంటారు. కొంచెం స్పైసీగా.. మరింత క్రిస్పీగా ఉండే ఈ టేస్టీ చికెన్ 65 తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఎవడురా బాబు ఈ అద్భుతాన్ని కనిపెట్టింది అని నోట్లో వేసుకుంటూ ఉంటారు.. ఇది కూడా చైనా నుంచి వచ్చిందని టక్కున అనేస్తారేమో.. నూడిల్స్, మంచూరియాల్లాంటివన్నీ వాడి వద్ద నుంచి వచ్చాయి కదా అని ఇది కూడా కన్నింగ్ కంట్రీ చైనా వంటకం అని మాత్రం అనకండి. ఇది కూడా మేడిన్ ఇండియా అండి బాబు.. ఈ చికెన్ 65 కనిపెట్టిన మహానుభావుడు ఎవరో కాదు మనోడే.. మన పక్క రాష్ట్రం తమిళనాడుకు చెందిన వ్యక్తి.

దీని వెనుక చెన్నైకి చెందిన ప్రముఖ చెఫ్ ఏఎం బుహారీ ఉన్నారు. 1965లో తన హోటల్‌లో ఈ రెస్పీని పరిచయం చేశారు. అది కూడా ఓ అద్భుతమైన సందర్భం కూడా ఉందండయ్.. భారత-పాకిస్తాన్‌ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇలాంటి ఓ వంటకం ఆలోచన వచ్చింది బుహారీ బాబుకు. భారత సైనికులకు తక్షణమే తయారు చేయగల రుచికరమైన మాంసాహార రుచులను అందించాలని ఆలోచన చేశాడు. ఆ ప్రయోగ ఫలితమే ఈ చికెన్ 65 పుట్టుకొచ్చింది. అయితే, చికెన్ 65కి ఆ పేరు పెట్టడం వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

కొంతమంది ఆహార నిపుణులు దీనిని సిద్ధం చేయడానికి 65 చిన్న చికెన్ ముక్కలను ఉపయోగించారు కాబట్టి అలా పిలుస్తున్నారని కొందరు అంటే.. మరికొందరు మాత్రం ఇందులో 65 రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు.. అందుకే ఆ పేరు వచ్చిందని అంటారు.

ఇంకొందరేమో 65 రోజుల కోడిని ఈ వంటకం తయారీకి ఉపయోగిస్తున్నారు అని మరో స్టోరీ కూడా ప్రచారంలో ఉంది. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది సైనికుల మెనూలో 65వ వంటకం చికెన్ 65 అందుకే ఇలా పిలుస్తారని కొందరు పాక శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అయితే బుహారీ హోటల్‌లో 1965లో తయారు చేసిన వంటకం.. అందుకే ఆ పేరు అనేదే ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.

ఇవి కూడా చదవండి: Telangana BJP: బండెనక బండి కట్టి.. నియోజకవర్గాలకు దూరమవుతున్న ఆ కమలం నేతలు..

IND-PAK: స్నేహపూర్వక వాతావరణం కోసం.. ప్రధాని మోడీని టీవీ చర్చకు ఆహ్వానించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..