- Telugu News Photo Gallery Know how You can control your cholesterol easily at an early stage Telugu Health tips
Cholesterol Diet Tips : కొలెస్ట్రాల్ పెరగకుండా నియంత్రించడానికి ఇవిగో మార్గాలు..
వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. మరీ ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడంతో శరీరాకృతి పూర్తిగా మారిపోతుంది. ఐతే మీ జీవనశైలిలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సమస్యను సులువుగా అతిక్రమించవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
Updated on: Feb 22, 2022 | 6:06 PM

ఆహారం తీసుకున్న 30 నుంచి 45 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీరు త్రాగాలి. గోరు వెచ్చని నీరు ఆహారంలోని పోషకాలను సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఫలితంగా కలిగే అనుభూతిని మీరే చూస్తారు.

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉత్తమ మార్గం నిమ్మరసం తాగడం. ఈ డిటాక్స్ వాటర్ ఆయిల్ ఫుడ్స్ తిన్న తర్వాత పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడంలో కూడా ఎంతో ప్రయోజనకారి.

భోజనం తర్వాత కనీసం 20 నిమిషాలు నడిస్తే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణాశయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

హెవీ మీల్స్ తీసుకున్న 20 - 25 నిముషాల తర్వాత కొన్ని ప్రోబయోటిక్స్ తీసుకోవచ్చు. ప్రోబయోటిక్స్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది వివిధ వ్యాధుల నుంచి పేగులను కూడా రక్షిస్తుంది. ది బెస్ట్ ప్రోబయోటిక్ పెరుగు.

గంటకోసారి తక్కువ మొత్తంలో ఫైబర్ అధికంగా ఉండే పండ్లను తినడం కూడా మంచిదే. ఇవి మలబద్దకాన్ని నివారించి, జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి.

రోజు మొత్తంలో తీసుకునే ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా చూసుకోండి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి, ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి పోషకాహార నిపుణులు ద్రవ ఆహారాన్ని తినమని ఎక్కువగా సిఫార్సు చేస్తారు.




