Mutton Paya: మేక కాళ్ల సూప్ తాగితే కలిగే లాభాలు తెలిస్తే వెంటనే తెచ్చి వండుకుంటారు..!
మాంసాహారం ఇష్టపడే వారికి మేక కాళ్ల సూప్ అంటే ప్రత్యేకమైన రుచి. ముఖ్యంగా తెలంగాణలో ఇది చాలామందికి ఆహారంలో భాగంగా ఉంటుంది. ఇది కేవలం రుచి మాత్రమే కాదు, కీళ్ల నొప్పులు తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుత ఫలితాలు ఇస్తుంది.

మాంసాహారం అంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. ముఖ్యంగా చికెన్ కంటే మటన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మటన్ రుచి మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన ప్రోటీన్‌లను సమృద్ధిగా అందిస్తుంది. ఇది శరీర నిర్మాణానికి, శక్తి పెంపుదలకు సహాయపడుతుంది. మటన్‌తో అనేక రకాల వంటకాలు చేస్తారు. సాధారణ మటన్ కర్రీ, తలకాయ కూర, కాళ్ల కూర, బోటీ వంటి వంటివి అందులో ఉన్నాయి.
కానీ వీటిలో మటన్ సూప్.. ముఖ్యంగా మేక కాళ్ల సూప్ (పాయా) ఆరోగ్యానికి ప్రత్యేకంగా మేలు చేస్తుంది. ఈ సూప్‌ను మిరియాలు, ఉలవలు వంటి పదార్థాలతో వండితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. మేక కాళ్ల సూప్‌లో ఉండే గ్లూకోసమైన్, హైఅల్యూరోనిక్ యాసిడ్, కొండ్రోయిటిన్ వంటి పోషకాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరానికి అవసరమైన పోషణను అందిస్తుంది. అంతేకాదు.. ఈ సూప్ రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలంగా ఉంచుతుంది.
మోకాళ్ల నొప్పులు లేదా ఇతర కీళ్ల సమస్యలతో బాధపడుతున్నవారికి వైద్యులు కూడా మేక కాళ్ల సూప్ తాగమని సూచిస్తారు. ఈ సూప్‌ను క్రమం తప్పకుండా తాగితే కీళ్ల నొప్పులు తగ్గి, శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. అయితే గ్యాస్ట్రిక్, ఉదర సంబంధ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే మంచిది.




