Leftover Rice: మిగిలిన పోయిన అన్నంతో గుజరాతీ ఫేమస్ స్నాక్.. రుచికరమైన ముతియా తయారీ..

Leftover Rice: దాదాపు ప్రతి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ను లెక్క చూసి మరీ అన్నం వండినా మిగిలి(Leftover Rice) పోవడం అనేది సర్వసాధారణమైన విషయం. అలా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని మళ్ళీ..

Leftover Rice: మిగిలిన పోయిన అన్నంతో గుజరాతీ ఫేమస్ స్నాక్.. రుచికరమైన ముతియా తయారీ..
Leftover Rice Food
Follow us
Surya Kala

|

Updated on: Jan 26, 2022 | 1:54 PM

Leftover Rice: దాదాపు ప్రతి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ను లెక్క చూసి మరీ అన్నం వండినా మిగిలి(Leftover Rice) పోవడం అనేది సర్వసాధారణమైన విషయం. అలా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని మళ్ళీ భోజనంలోకి చాలా మంది ఉపయోగిస్తారు. అయితే కొంతమంది మిగలిన అన్నాన్ని మేక్ఓవర్ చేయడానికి ఇష్టపడతారు. అయితే మిగిలిపోయిన ఆహారంతో ప్రత్యేకంగా ఏదైనా వంటకం తయారు చేయడం గ్యాస్ట్రోనమీగా ప్రపంచంలో ట్రెండ్‌గా మారింది. గ్యాస్ట్రోనమీలో కొన్ని డెజర్ట్‌లు మనకు తెలుసు.. ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తూ.. సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్ (Chef Sanjeev Kapoor) ఇటీవల మిగిలిపోయిన అన్నంతో తయారుచేసిన ఒక ప్రసిద్ధ వంటకాన్ని పంచుకున్నారు. అది ప్రముఖ గుజరాతీ వంటకం.. ముతియా. ఈ ముతియా రెసిపీ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ( Instagram)లో షేర్ చేశాడు. ఈ ముతియా అనేది సాంప్రదాయక వంట. శనగపిండి, మెంతి, ఉప్పు, పసుపు వంటి వాటితో తయారు చేసే ఒక స్నాక్. ఈ ముతియా స్నాక్ ను ఆవిరితో కానీ నూనె లో వేయించి కానీ తయారు చేసుకోవచ్చు. చెఫ్ సంజీవ్ కపూర్ మిగిలిపోయిన అన్నంతో ప్రత్యేకమైన వంటకం తయారు చేశారు. దీనికి ముతియా అని పేరు పెట్టారు.

సంజీవ్ కపూర్ వంటకం ఎలా తయారు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

చెఫ్ సంజీవ్ కపూర్ మిగిలిపోయిన అన్నం ముతియా రెసిపీ: ముందుగా రెండు కప్పుల మిగిలిపోయిన అన్నం తీసుకోండి. తర్వాత అరకప్పు శెనగపిండి, అల్లం-మిర్చి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, ఎర్ర కారం, జీలకర్ర పొడి, పంచదార , పెరుగు వేసి అన్నీ కలపాలి. చిటికెడు బేకింగ్ సోడా , నూనె వేసి మళ్ళీ ఈ మిశ్రమాన్ని మరోసారి కలపండి. తర్వాత ఈ మిశ్రమంలో గోధుమ పిండి వేసి.. మెత్తగా పిండి చూసుకోండి. అనంతరం ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. తర్వాత ఆ ఉండలను చిన్న గా పొడవుగా రోల్ చేసుకోవాలి. అనంతరం వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత చిన ముక్కలుగా కట్ చేసి.. చల్లారబెట్టుకుని చిన్నగా రౌండ్ గా ముక్కలు కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి.. నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి. కొంచెం బిర్యానీ మసాలాను వేసుకుని వేయించుకుని అందులో రెడీ చేసుకున్న ముతియాలను వేసి వేయించాలి. అంతే మిగిలి పోయిన అన్నంతో రుచికరమైన గుజరాతీ స్నాక్ ముతియా తినడానికి రెడీ.

Also Read:  మంచు వర్షంలో పల్లకిలో ఊరేగిన పెళ్లికొడుకు.. నెట్టింట వీడియో వైరల్‌ ..