AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా?.. సోంపును ఇలా తీసుకోండి..

Weight Loss Tips: సోంపు గురించి తెలియని వారెవరూ ఉండరు. చిన్న పిల్లలు మొదలు.. పెద్ద వాళ్ల వరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు.

Weight Loss Tips: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా?.. సోంపును ఇలా తీసుకోండి..
Shiva Prajapati
|

Updated on: Jan 26, 2022 | 8:23 PM

Share

Weight Loss Tips: సోంపు గురించి తెలియని వారెవరూ ఉండరు. చిన్న పిల్లలు మొదలు.. పెద్ద వాళ్ల వరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. మౌత్ ఫ్రెష్‌నగర్‌గా ఇది పని చేస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. వీటిని కూరలు, పచ్చళ్లలో కూడా వినియోగిస్తారు. స్వీట్లలో కూడా సోంపురె వినియోగిస్తారు. అయితే, ఇవి టేస్టీ మాత్రమే కాదు.. వ్యక్తులు బరువు తగ్గడంలోనూ అద్భుతంగా సహాయపడుతాయి. బరువు తగ్గడానికి సోంపు గింజలను అనేక రకాలుగా వినియోగించవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వలన ఆకలిగా అనిపించదు, అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. శరీరంలో టాక్సిన్స్‌ని తొలగించడంలో సహాయపడతాయి. జీవక్రియ రేటును వేగవంతం చేస్తాయి. మరి బరువు తగ్గడానికి సోంపు ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం..

సోంపు నీరు.. బరువు తగ్గడంలో సోంపు వాటర్ అద్భుతంగా పని చేస్తుంది. ఒక జగ్‌లో 2 గ్లాసుల వాటర్ పోసి, అందులో 1 టేబుల్ స్పూన్ సోంపును నానబెట్టాలి. అందులో కొంత పసుపు వేసి బాగా కలపాలి. రాత్రంతా అలాగే నానబెట్టి ఉంచాలి. ఉదయం, ఒక గ్లాసు సోంపు నీటిని మరిగించి, వడపోసి ఖాళీ కడుపుతో త్రాగాలి. సాయంత్రం వేళ కొంచెం గోరువెచ్చగా మరో గ్లాసు సోంపు వాటర్ తాగండి. ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

సోంపు పొడి.. సోంపు పొడి కూడా బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది. అంతేకాదు, గ్యాస్, కడుపు నొప్పి, ఆమ్లత్వ, అజీర్తి వంటి ఉదర సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత గోరువెచ్చని నీటితో ఒక చెంచా పొడిని కలుపుకుని తాగాలి. సోంపులో ఎస్ట్రాగోల్, ఫెంచోన్, అనెథోల్ ఉండటం వల్ల జీర్ణక్రియలో సహాయపడే గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌ల స్రావానికి సహాయపడుతుంది. ఈ పొడిని తయారు చేయడానికి.. 4 టేబుల్ స్పూన్ల సోంపు గింజలు, 2 టేబుల్ స్పూన్లు వాము, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 టీస్పూన్ ఇంగువ, 1 టీస్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టీస్పూన్ చెక్కర తీసుకోవాలి. సోంపు గింజలు, వాము, జీలకర్ర, మెంతి గింజలను తక్కువ మంటపై 4 నిమిషాలు వేయించాలి. ఆ తరువాత వాటిని పొడిగా దంచాలి. ఇప్పుడు బ్లాక్ సాల్ట్, పంచదార, ఇంగువ కూడా వేసి మిక్స్ చేయాలి. ఈ పొడిని గాలి తగలకుండా ఉండే ఒక బాక్స్‌లో నిల్వ చేయండి.

సొంపు టీ.. చాలా మంది టీ తాగకుండా ఉండలేరు. అయితే, టీ తాగడానికి బదులుగా సోంపు, బెల్లంతో చేసిన టీని తాగడం అలవాటు చేసుకుంటే.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఒక పాత్రలో కప్పు నీరు, ఒక టీస్పూన్ సోంపు వేసి మరిగించండి. ఆ తరువాత దానికి 1 టీ స్పూన్ టీ ఆకలు, 1 టీ స్ఫూన్ బెల్లం పొడిని కలపండి. ఆ తరువాత ఒక కప్పు పాలు కలపండి. టీ మరిగిన తరువాత గ్యాస్ బంద్ చేసి.. ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత వడపోసుకుని తాగండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద నిపుణుల సమాచారం మేరకు దీనిని పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని ప్రయత్నించే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించండి.

Also read:

Benefits of Methi: మెంతులతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఆకలిని పెంచడమే కాదు..

Amalapuram: లిక్కర్ గోడౌన్‌లో పనిచేస్తోన్న యువతిపై డిపో మేనేజర్ లైంగిక వేధింపులు.. భరించలేక ఆమె ఏం చేసిందంటే

Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..