AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ ఒక్క ఫ్రూట్ తింటే.. సర్వ రోగాలు దూరం.. అదేంటో తెలుసా?

Dragon Fruits: డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా చాలా వ్యాధులను అధిగమించవచ్చు. ఇది మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

Health Tips: ఈ ఒక్క ఫ్రూట్ తింటే.. సర్వ రోగాలు దూరం.. అదేంటో తెలుసా?
Dragon Fruit
Venkata Chari
|

Updated on: Sep 06, 2022 | 6:00 AM

Share

డ్రాగన్ ఫ్రూట్స్‌లో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక వ్యాధులను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. ఇది చర్మం నుంచి జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తుంది. అలాగే, డయాబెటిస్‌లో కూడా డ్రాగన్ ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తుంటారు. ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. ఇది అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్స్ వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

డ్రాగన్ ఫ్రూట్స్ ప్రయోజనాలు..

డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా చర్మం నుంచి జుట్టు వరకు సమస్యలను అధిగమించవచ్చు. దాని ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది..

చర్మ సంబంధిత రుగ్మతలను తొలగించడంలో డ్రాగన్ ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైనవి. ఈ పండుతో మీరు సహజమైన ఫేస్ ప్యాక్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీంతో చర్మంపై మెరుపు వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. అంతే కాకుండా ఇందులో ఉండే విటమిన్ బి3 చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.

జుట్టు ఆరోగ్యంగా ఉంచుతాయి..

డ్రాగన్ ఫ్రూట్ మీ చర్మానికి మాత్రమే కాదు, దీన్ని ఉపయోగించడం ద్వారా మీ జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ పండులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు నుంచి వచ్చే చుండ్రు సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.

చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది..

డ్రాగన్ ఫ్రూట్ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. జఫ్లావనాయిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫినోలిక్ యాసిడ్, ఫైబర్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. ఇవి చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. దీని వినియోగంతో మధుమేహాన్ని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు.

కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది..

శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ అనేక వ్యాధులకు కారణం కావచ్చు. ముఖ్యంగా దీనివల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. మీరు కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలనుకుంటే, డ్రాగన్ పండ్లను తినండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్