Weight Loss Tips: ఉదయాన్నే ఇవి కలిపిన నీటిని తాగితే.. మధుమేహం, గుండె జబ్బులకు చెక్ పెట్టినట్లే.!

Fenugreek Seeds Health Benefits: వేగంగా పెరుగుతున్న మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కొన్ని ఇంటి చిట్కాలు ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని అధ్యయనాలలో తేలింది.

Weight Loss Tips: ఉదయాన్నే ఇవి కలిపిన నీటిని తాగితే.. మధుమేహం, గుండె జబ్బులకు చెక్ పెట్టినట్లే.!
Fenugreek Seeds Water
Follow us
Venkata Chari

|

Updated on: Oct 13, 2022 | 6:14 PM

ఆరోగ్యవంతమైన జీవితానికి ఆయుర్వేదం మంచి ఎంపికగా పరిగణిస్తుంటారు. ఆయుర్వేదంలో ఇటువంటి అనేక ఔషధాలు ఎన్నో ప్రస్తావించారు. వీటిని ఉపయోగించడం వలన అనేక రకాల తీవ్రమైన వ్యాధుల ప్రమాదం నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి. మీ దినచర్యలో ఆయుర్వేదాన్ని చేర్చుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. వేగంగా పెరుగుతున్న మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కొన్ని ఇంటి చిట్కాలు ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని అధ్యయనాలలో తేలింది.

ఇందులో ముఖ్యంగా మెంతులు కూడా దివ్య ఔషధంలా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇది అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా మెంతికూర నీటిని తీసుకోవడం అలవాటు చేసుకుంటే, దాని నుంచి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

మీరు ఉదయాన్నే తినే ఆహారం శరీరంపై అనేక ప్రభావాలను చూపుతుంది. ఎందుకంటే ఈ సమయంలో జీర్ణక్రియ, జీవక్రియ రేటు మెరుగ్గా ఉంటుంది. బరువు తగ్గడం నుంచి మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం వరకు, మెంతి నీటిని తీసుకోవడం వలన మీరు ప్రయోజనాలను పొందవచ్చు. ఇది కాకుండా, మెంతులు అనేక రకాల విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

అధిక బరువును తగ్గించడంలో..

అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతుంటే, అందులో మెంతికూర నీటిని తీసుకోవడం వల్ల మీకు ప్రయోజనాలు లభిస్తాయి. మెంతి నీటి వినియోగం జీర్ణక్రియను ప్రోత్సహించడంలో, జీవక్రియను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడంలో ప్రయోజనం పొందవచ్చని తెలుస్తోంది. మెంతికూరలో సహజంగా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఆకలి, కేలరీలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మెంతులు తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి గొప్ప మార్గంగా ఉంటుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనాలు..

మెంతి గింజలు మధుమేహం నిర్వహణ, నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇన్సులిన్ చర్య, సున్నితత్వాన్ని పెంచడంలో సహాయపడటం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. మెంతి నీరు తీసుకోవడం అలవాటు కార్బోహైడ్రేట్లు, చక్కెర శోషణను నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. మెంతి గింజలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తుంటారు.

కొలెస్ట్రాల్ నియంత్రణలో..

మధుమేహంతో పాటు, మెంతి నీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా మీకు ప్రయోజనం చేకూరుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు కనుగొన్నాయి. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు దారి తీస్తుంది. రోజూ మెంతికూర నీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల ఇలాంటి తీవ్రమైన, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

చర్మం ఆరోగ్యంగా ఉంచేందుకు..

మెంతి నీరు చర్మ ఛాయను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మెంతులు జీర్ణక్రియలో సహాయపడతాయి. టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి. ఇది చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మెంతి గింజలలో విటమిన్-కె, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇది మొటిమలు, కళ్ళ కింద నల్లటి వలయాలు వంటి అన్ని చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. మెంతి నీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవడం ద్వారా మీరు ఇలాంటి ప్రయోజనాలను ఎన్నో పొందవచ్చు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం అవగాహన కోసమే అందించాం. వీటిని పాటించే ముందు దయచేసి డాక్టర్ లేదా నిపుణుల సలహాలు తప్పక తీసుకోవాలి.