White Bread: బ్రెడ్‌ మరీ ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..

బ్రెడ్ తింటే సులువుగా జీర్ణం అవుతుందని.. అందుకే జ్వరం వచ్చినా, అరోగ్యం బాగాలేకపోయినా బ్రెడ్ తింటుంటాం..

White Bread: బ్రెడ్‌ మరీ ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..
Bread
Follow us

|

Updated on: Mar 18, 2022 | 4:03 PM

బ్రెడ్ తింటే సులువుగా జీర్ణం అవుతుందని.. అందుకే జ్వరం వచ్చినా, అరోగ్యం బాగాలేకపోయినా బ్రెడ్ తింటుంటాం. ఎక్కువ మంది వైట్ బ్రెడ్(White Bread) తింటుంటారు. అయితే ఈ వైట్ బ్రెడ్ తినకూడదనే వారు చాలా మంది ఉన్నారు. ఈ వైట్‌ బ్రెడ్‌ను చాలా మంది ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటారు. కొందురు టీ(Tea)లో ముంచుకుని బ్రెడ్ తింటారు. జామ్ పెట్టుకుని తింటారు. వైట్ బ్రెడ్ అధిక కార్బోహైడ్రేట్(Carbohydrates) కంటెంట్ కలిగి ఉంటుంది. ఇది అధికంగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఈ సాధారణంగా వైట్ బ్రెడ్ తయారీకి మైదా పిండిని ఉపయోగిస్తారు. అయితే మైదాను అధికంగా తీసుకోవడం వల్ల అనేక రకాల కడుపు సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా మైదాలో చెడు కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ. అది బాడీలో పెరిగే కొద్దీ అడ్డమైన రోగాలు వచ్చేలా చేస్తుంది. బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, వేడి ఇలాంటి అంశాలన్నీ కలిసి హైబీపీ వచ్చేలా చేస్తాయి. అందుకే మైదాతో చేసిన పదార్థాలు తినకూడదు.  అందుకే గోధుమలతో తయారు చేసే బ్రెడ్ తినడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

వైట్ బ్రెడ్ తింటే ఏమవుతుంది

1.వైట్ బ్రెడ్ తినడం వల్ల బరువు పెరుగుతారు. అంటే స్థూలకాయంతో బాధపడేవారు వైట్ బ్రెడ్ తినకూడదు.

2. అంతే కాకుండా దీన్ని తినడం వల్ల షుగర్ లెవెల్ పెరుగుతుంది. అంటే షుగర్ పేషెంట్స్ దీనిని తినకూడదు.

3. తెల్ల రొట్టె తినడం మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతారు.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Read Also.. Health News: ఈ సమయాలలో కచ్చితంగా నీరు తాగండి.. లేదంటే ఆరోగ్యానికి పెద్ద ఎదురుదెబ్బ..!