డేట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలు
డేట్స్ తినడం ద్వారా ఆరోగ్యానికి అనేక లాభాలున్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. డేట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యం, కంటి సమస్యలు, కేన్సర్ రాక తగ్గించడంలో సహాయపడతాయి. డేట్స్‌లో కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు ఎముకల బలాన్ని పెంచుతాయి. ఫైటో హార్మోన్లు చర్మానికి సహజ మెరుపు తెచ్చి అందాన్ని పెంచుతాయి. ప్రతి రోజూ రెండు డేట్స్ తినడం ఆరోగ్యానికి, అందానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
డేట్స్.. పోషకాలు కలిగిన పండ్లలో ఇవి కూడా ఒక్కటి. వీటిని తినడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలా రకాలుగా కూడా ఫుడ్ డైట్ లో యాడ్ చేసుకొని తింటారు. ఇవి తినడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీ ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. స్కిన్ కి కూడా చాలా మంచిది. ప్రతి రోజు రెండే రెండు డేట్స్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణవ్యవస్థకు డేట్స్
డేట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అజీర్ణం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా, రోజూ రెండు డేట్స్ తినడం శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది.
పలు వ్యాధుల నుండి రక్షణ
డేట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను రక్షించి గుండె ఆరోగ్యం, కంటి ఆరోగ్యం, కేన్సర్ రాక తగ్గించడంలో సహాయపడతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
డయాబెటిస్ కి డేట్స్ తో చెక్
డేట్స్ తీయగా ఉన్నప్పటికీ డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు. ఇవి (glycemic index) తక్కువగా ఉండడంతో రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువగా ప్రభావితం చేయవు. అయితే లిమిటెడ్ గా తినడం మంచింది.
డేట్స్ తో మీ ఎముకలు స్ట్రాంగ్
డేట్స్‌లో కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి. రోజూ రెండు డేట్స్ తినడం వల్ల (osteoporosis) వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
స్కిన్ గ్లోకి డేట్స్
డేట్స్‌లో (phytohormones) పుష్కలంగా ఉండి చర్మానికి సహజ మెరుపు తెస్తాయి. దీనిని నేరుగా తినడం లేదా డేట్స్‌తో తయారైన క్రీములు వాడడం ద్వారా స్కిన్ సాఫ్ట్ గా ఉంటుంది. స్కిన్ గ్లోను కూడా ఇస్తుంది. ఇలా డేట్స్ తినడం ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా మంచిది.