AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Custard Apple: సీతాఫలమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష.. దీని ప్రయోజనాలు తెలిస్తే మీరు ఒప్పుకోవాల్సిందే…

కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించే శక్తి కూడా సీతాఫలానికి ఉంది. రోగనిరోధక శక్తి పెంపొందించే సీతాఫలం మన ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. అమృతాన్ని తలపించే సీతాఫలం తింటే..

Custard Apple: సీతాఫలమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష.. దీని ప్రయోజనాలు తెలిస్తే మీరు ఒప్పుకోవాల్సిందే...
Custard Apple Health Benefits
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 14, 2023 | 9:39 AM

Share

మన ఆకలిని తీర్చడానికే కాక ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఎన్నో రకాల పండ్లు ప్రకృతిలో దొరుకుతాయి. ఒక్కప్పుడు పండ్లు వాటి వాటి సీజన్‌లలో మాత్రమే లభించాయి. అయితే ప్రస్తుతం అవి అన్నీ కాలల్లో, సీజన్‌లలో లభిస్తున్నాయి. ఇక పండ్లలో దొరికే పోషకాలు మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇంకా వీటిని తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు మన దరి చేరవు. వీటిలో ఉండే మాంసకృతులు, విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్, ఔషధ గుణాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటి పండ్లలో సీతాఫలం ప్రముఖమైనది. దీనిలోని గుజ్జు నుంచి పారవేసే గింజల వరకూ ఎంతో ఉపయోగకరమని  వైద్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాక కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించే శక్తి కూడా సీతాఫలానికి ఉంది. రోగనిరోధక శక్తి పెంపొందించే సీతాఫలం మన ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. అమృతాన్ని తలపించే సీతాఫలం తింటే నోటిలోని జీర్ణరసాలను పెరుగుతాయి. తద్వారా జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అన్నికాలలోనూ లభించే సీతాఫలం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి
  1. బరువు పెరగాలనుకొనే వారు సీతాఫలం జ్యూస్‌లో తేనె, పాలు కలిపి నిత్యం తీసుకొంటే ఫలితాలు ఉంటాయి.
  2. గర్భిణీ స్త్రీలు సీతాఫలం తింటే గర్భస్రావాన్ని నివారించడమే కాక, కడుపులో పెరిగే శిశువు మెదడు, నాడీ వ్యవస్థ, వ్యాధినిరోధక శక్తి కూడా మెరుగుపడతాయి.
  3. విటమిన్ బి6 అధికంగా ఉండే సీతాఫలాలను తినడం వల్ల బ్రోంకైల్ ఇన్ప్లమేషన్ తగ్గి ఆస్తమా అటాక్‌ తగ్గుతుంది.
  4. మెగ్నీషియం అధికంగా కలిగి ఉన్న సీతాఫలం హార్ట్ ఎటాక్ నుంచి రక్షిస్తుంది.
  5. సీతాఫలంలో కాపర్, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాపర్ మన జీర్ణశక్తిని మెరుగుపడేలా చేస్తుంది. ఫైబర్ మలబధ్ధకాన్ని,టైప్ 2 డయాబెటిస్‌ని నివారిస్తుంది.
  6. సీతాఫలంలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల బ్లడ్ ప్రెజర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంటాయి.
  7. సీతాఫలంలో ఉండే నియాసిన్, డైటరీ ఫైబర్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రిస్తాయి. అలాగే వీటిలో ఐరెన్ అధికంగా ఉండడం వల్ల అనీమియా వ్యాధిని నివారిస్తుంది.
  8. సీతాఫలం తినడం వల్ల దంతాలకు కూడా చాలా మంచిది. దంతాల నొప్పి, దంతక్షయం నివారణకు ఈ పండు ఉపయోగపడుతుంది.
  9. రెబోప్లెవిన్, విటమిన్ సి అధికంగా ఉండే సీతాఫలం తింటే కంటికి చాలా మంచిది. ఫ్రీరాడికల్స్‌ను నివారించి మంచి కంటి చూపునిస్తుంది.
  10. ఇందులో ఉండే మెగ్నీషియం శరీరంలో నీటి సమతుల్యతకు సహాయపడుతుంది.. జాయింట్ పెయిన్స్‌ను కూడా నివారిస్తుంది.
  11. స్కిన్ అలర్జీని, స్కిన్ క్యాన్సర్ రాకుండా సీతాఫలం సహాయపడుతుంది. డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..