Ginger for Health: చిన్న అల్లం ముక్కతో ఇన్ని ఉపయోగాలా..! తెలిస్తే తినకుండా ఉండలేరంతే..
ఖరీదైన మందులు కూడా నయం చేయలేని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని ఒక చిన్న అల్లం ముక్క నయం చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా దీనికి ఉన్న ప్రత్యేకత గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ప్రతిరోజూ మన వంటలలో..
మనం తినే వంటకాలలో అల్లం తరచూ కనిపించే ఒక సుగంధద్రవ్యం. దీనిని కూరలలో కలిపి తినడం వల్ల ఆహారం రుచి రెట్టింపవుతుంది. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే వంట గదిలో అల్లం లేకుంటే అది వంటగదే కాదు. తరచూ కూరల్లో వినియోగించే అల్లంలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఇన్నీకావు. ఖరీదైన మందులు కూడా నయం చేయలేని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని ఒక చిన్న అల్లం ముక్క నయం చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా దీనికి ఉన్న ప్రత్యేకత గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ప్రతిరోజూ మన వంటలలో క్రమం తప్పకుండా అల్లం వినియోగిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనిర్వచనీయమని నిపుణులు అంటున్నారు. వంటకాల్లో అల్లం వేయకపోతే రుచి ఎలాగైతే ఉండదో.. ఆరోగ్యం విషయంలో కూడా అల్లం తీసుకోకపోతే అంత చేటుగా ఉంటుందని వారు చెబుతున్నారు. మరి అల్లం ద్వారా మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
- అల్లాన్ని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
- అల్లం పేగుల్లో ఏర్పడే వ్యాధికారక బ్యాక్టీరియాను నాశనం చేయడమే కాక కాలేయాన్ని శుభ్రం చేస్తుంది.
- అల్లం రసం పాలలో కలుపుకుని తాగితే రోగాలు దరిచేరవు. బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే గొంతు నొప్పి, ఛాతి నొప్పిని దూరం చేస్తుంది.
- కొద్దిపాటి అల్లాన్ని రసం తీసి అందులో బెల్లం కలిపి తీసుకుంటే వాత సమస్యలు దూరమవుతాయి. అల్లం, పుదీనా రసం కలిపి తీసుకుంటే పిత్త, అజీర్తి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
- అల్లం, కొత్తిమీర కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. నోటి దుర్వాసన తగ్గాలంటే చిన్న అల్లం ముక్క నోట్లే వేసుకుంటే సరి.
- రోజువారీ ఆహారంలో తగిన మోతాదులో అల్లం తీసుకుంటే శరీరానికి చురుకుదనం వస్తుంది. ఆకలి మందగించడం, వేవిళ్లు, అజీర్తి లాంటి రుగ్మతలను తొలగించడంలో అల్లం యాంటీ యాక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
- అల్లం కంటే శొంఠిలో ఎక్కువ ఔషధ గుణాలున్నాయి ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..