- Telugu News Photo Gallery Here are the foods that can boost your immunity system in the body and know more in Telugu
Immunity Boosters: మీ శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయాలనుకుంటే.. తప్పక తీసుకోవలసిన ఆహారాలు ఇవే..
అనేక రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని సంరక్షించడంలో దేహానికి సహజంగానే రోగనిరోధకశక్తి ఉంటుంది. అయితే మనం పాటించే చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఆ శక్తి లోపించే ప్రమాదం ఉంది. అలా రోగనిరోధక శక్తి లోపించినవారు తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. మరి రోగనిరోధక శక్తిని సహజంగా పెంచుకోవడానికి ఎటువంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 14, 2023 | 7:37 AM

కివీ పండు: కివీ పండులో విటమిన్ కె, విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇది శరీరంలోని తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది. తెల్ల రక్తకణాలు ఏవైనా ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాప్తి చెందకుండా నిరోధించడమే కాక రోగనిరోధక శక్తికి అండగా నిలుస్తాయి. అందువల్ల శరీర రోగనిరోధక శక్తిని పెంపొంచుకోవడానికి తప్పనిసరిగా కివీ పండ్లను తీసుకోవాలి.

బొప్పాయి పండు: బొప్పాయిలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి కావలసిన అనేక పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. వివరంగా చెప్పుకోవాలంటే ఇందులో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్లు సి, బి, ఇ పుష్కలంగా ఉండడం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాక అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా కల్పిస్తుంది.

పుచ్చకాయ: పుచ్చకాయలో పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, గ్లూటాతియోన్ పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా ఇది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో సహాయపడుతుంది.

దానిమ్మ: దానిమ్మపండును తీసుకోవడం వల్ల ఇది శరీరంలోని సాల్మొనెల్లా, లిస్టిరియా వంటి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. అంతేకాక దంత ఫలకం, చిగుళ్ల వ్యాధిలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

గుడ్లు: అనేక రకాలు పోషకాలకు నిధిలా ఉండే గుడ్లను ప్రతిరోజూ తినడం ఎంతో మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇదిశరీరంలో లిపోప్రొటీన్(HDL)ని పెంచడంలో సహాయపడడమే కాక గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర ఆరోగ్య సమస్యలకు వ్యతిరేకంగా పోరాడడంలో శరీర వ్యవస్థకు సహాయపడుతుంది.

పసుపు పొడి: భారతీయ ఆహార పదార్థాలలో ఉపయోగించే పసుపు పొడి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టిరియల్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల జలుబు, దగ్గు ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అంతేకాక రోగ నిరోధక వ్యవస్థను పటిష్టపరుచుకోవడానికి పసుపు ఉత్తమమైన ఎంపిక.

బాదం: బాదంపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉండడం వల్ల ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అదనంగా ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైన కొవ్వులను శరీరాన్ని అందిస్తుంది.

సిట్రస్ పండ్లు: నిమ్మ, ద్రాక్ష, నారింజ వంటి సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాక పలు రకాల సీజనల్ వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది.





























