- Telugu News Photo Gallery You will get Amazing skincare Benefits with Eucalyptus oil and Know here in Telugu
Skincare Tips: నీలగిరి తైలం-చర్మానికి అమృతం.. చర్మ సంరక్షణలో దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే..
ప్రస్తుత కాలుష్య ప్రపంచంలో ఆరోగ్య, చర్మ సంరక్షణ ఎంతో సవాలుగా మారింది. ముఖ్యంగా చర్మం కోసం యువతీయువకులు ఏవేవో కాస్మటిక్స్ వాడి వారి చర్మాన్ని మరింతగా పాడుచేసుకుంటున్నారు. ఎటువంటి రసాయనాలను వాడకుండా, సహజ పద్ధతులలోనే చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. ఈ క్రమంలో యూకలిప్టస్ ఆయిల్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ ఆయిల్ ఎటువంటి ప్రయోజనాలను కలిగి ఉందో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jan 14, 2023 | 6:58 AM

onion oil

యూకలిప్టస్ నూనెను యూకలిప్టస్ చెట్టు ఆకుల నుంచి చేస్తారు. ఈ నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పలు లక్షణాలు చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి.

వడదెబ్బ నుంచి రక్షణ: యూకలిప్టస్ ఆకులకు శరీరం, చర్మం వడదెబ్బ బారిన పడకుండా రక్షిస్తుంది. అంతేకాక వడదెబ్బ తగిలిన వారు తొందరగా కొలుకునేలా చేసే లక్షణాలు కూడా ఈ నూనెలోపుష్కలంగా ఉన్నాయి.

చర్మాన్ని తేమగా ఉంచుతుంది: యూకలిప్టస్ ఆయిల్ చర్మాన్ని తేమగా ఉంచే గుణాన్ని కూడా కలిగి ఉంది. చర్మం పొడిబారినప్పుడు చాలా సమస్యలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిల చర్మంపై యూకలిప్టస్ నూనెతో మసాజ్ చేసుకోవచ్చు. ఎండాకాలం, చలికాలం అని తేడా లేకుండా చర్మ సంరక్షణ కోసం యూకలిప్టస్ నూనెను ఉపయోగించవచ్చు.

గాయాలు త్వరగా నయమవుతాయి: యూకలిప్టస్ ఆయిల్ ద్వారా మనం పొందగలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది చర్మంపై ఉన్న చిన్న చిన్న గాయాలను త్వరగా నయం చేస్తుంది.ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలే ఇందుకు కారణం. గాయాలు అయినప్పుడు యూకలిప్టస్ నూనెను రోజుకు రెండుసార్లు వాటిపై రాయండి. తక్షణ ఫలితాలను మీరే గమనించవచ్చు.

నూనెను ఎలా రాయాలంటే: ఇతర నూనెలను వాడిన మాదిరిగా కాకుండా యూకలిప్టస్ నూనెను వాడే విధానం భిన్నంగా ఉంటుంది. దీన్ని మీరు చర్మంపై నేరుగా అప్లై చేయకుండా, రోజూ వాడే నూనెలో కలపండి. సాధారణ నూనెలో కొన్ని చుక్కల యూకలిప్టస్‌ను మాత్రమే కలపాలి.





























