Chintachiguru royyalu curry: అమ్మ చేతి కమ్మని వంట.. ఈజీగా టేస్టీగా చింతచిగురు రొయ్యలు కూర తయారీ
Chinta Chiguru Royyalu Curry: జూన్ లో చింతచిగురు ఎక్కువగా దొరుకుంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ చింత చిగురుతో తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాలైన..
Chinta Chiguru Royyalu Curry: జూన్ లో చింతచిగురు ఎక్కువగా దొరుకుంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ చింత చిగురుతో తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాలైన కూరలు చేసుకుంటారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలతో చింత చిగురు రొయ్యలు ఎంతో ప్రసిద్ధి. ఈరోజు అమ్మ స్టయిల్ లో రుచికరమైన చింత చిగురు పచ్చి రొయ్యలు కూర తయారీ గురించి తెలుసుకుందాం..!
కావాల్సిన పదార్ధాలు
చింత చిగురు పచ్చి రొయ్యలు ఉల్లిపాయలు పచ్చి మిర్చి పసుపు కారం నూనె రుచికి సరిపడా ఉప్పు
తయారు చేసే విధానం:
ముందుగాస్టౌ మీద బాణలి పెట్టి.. రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను , నిలువుగా చీల్చిన పచ్చిమిర్చిని వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకుని.. రొయ్యలను వేసుకోవాలి.. రొయ్యలను ఉల్లిపాయముక్కలను వేయించిన తర్వాత కొంచెం కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేగుతున్న సమయంలో చింత చిగురుని కాడలు లేకుండా చేసుకుని.. ఉల్లిపాయలు రొయ్యల మిశ్రమంలో వేసుకుని కొంచెం సేపు వేయించాలి. అనంతరం కొంచెం నీరు పోసి.. కూర ఉడికించుకోవాలి. ఉప్పు చూసుకుని నీరు లేకుండా దగ్గరకు ఉడికిన తర్వాత స్టౌ మీద నుంచి దింపేసుకోవాలి. అంతే ఎంతో ఈజీగా టేస్టీ టేస్టీ గోదావరి పద్ధతిలో చింత చిగురు పచ్చి రొయ్యలు కూర రెడీ. ఇది పుల్లపుల్లగా ఉండి అన్నంలోకి ఎంతొ బాగుంటుంది.
Also Read: క్యాబేజి తినడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే కష్టమైనా ఇష్టంగా తినడం అలవాటు చేసుకుంటాం..!