AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లగా ఉన్నాయని చిన్న చూపు చూసేరు.. పవర్‌ఫుల్.. ఇవి తింటే ఉక్కులా మారాల్సిందే..

ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరం. చాలా మంది ప్రజలు కాల్షియం కోసం పాలను తీసుకుంటారు.. అయితే నల్ల నువ్వులు దీని కంటే మరింత ప్రభావవంతంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.. అయితే.. నల్ల నవ్వులు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? ఏ సమయంలో తింటే మంచిది.. నిపుణులు ఏం చెబుతున్నారు.. అనే వివరాలను తెలుసుకోండి..

నల్లగా ఉన్నాయని చిన్న చూపు చూసేరు.. పవర్‌ఫుల్.. ఇవి తింటే ఉక్కులా మారాల్సిందే..
కొందరు మహిళ్లల్లో ఎదురయ్యే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను పోగొట్టడానికి నువ్వులు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. నువ్వులలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. నువ్వుల్లో ఎక్కువ మొత్తంలో జింక్ ఉంటుంది. ఇది శరీరంలో ప్రొజెస్టెరాన్ మొత్తాన్ని పెంచుతుంది. నువ్వులు పీరియడ్ చక్రాన్ని క్రమబద్ధం చేస్తుంది.
Shaik Madar Saheb
|

Updated on: Dec 29, 2024 | 6:28 PM

Share

ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం ఒక ముఖ్యమైన పోషకం. దీని కోసం, ప్రజలు సాధారణంగా పాలు, జున్ను, పెరుగు వంటి ఆహార పదార్థాలను తీసుకుంటారు. కానీ, కొందరు వ్యక్తులు పాలు, దాని ఉత్పత్తులకు దూరంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో, ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం తీసుకోవడం సవాలుగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, ఆహారంలో నల్ల నువ్వులను చేర్చడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నల్ల నువ్వులలో పాల కంటే చాలా రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. నల్ల నువ్వులు కాల్షియానికి అద్భుతమైన మూలం మాత్రమే కాదు.. ఎముకల పెరుగుదల, బలానికి అవసరమైన అనేక ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. నల్ల నువ్వులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఏ సమయంలో తీసుకోవాలి.. అనే వివరాలను తెలుసుకోండి..

పుష్కలంగా కాల్షియం..

100 ml పాలలో 123 mg కాల్షియం ఉంటుంది.. అయితే నల్ల నువ్వులలో 1286 mg కాల్షియం ఉంటుంది.. అంటే నువ్వులలో కాల్షియం మొత్తం పాల కంటే చాలా రెట్లు ఎక్కువ. అటువంటి పరిస్థితిలో.. మీకు పాలు తాగాలని అనిపించకపోతే లేదా కొన్ని కారణాల వల్ల పాలు తీసుకోలేకపోతే, నల్ల నువ్వులు గొప్ప ప్రత్యామ్నాయం.. అని నిపుణులు చెబుతున్నారు..

ఎముకలకు ఇతర ప్రయోజనాలు..

నల్ల నువ్వులలో కాల్షియం మాత్రమే కాకుండా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన మెగ్నీషియం.. ఫాస్పరస్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా, నల్ల నువ్వులలో మంచి మొత్తంలో జింక్ కూడా ఉంటుంది.. ఇది ఎముకల సాంద్రతను పెంచుతుంది. ఎముకలు విరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ మూలకం బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఆర్థరైటిస్ – కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం

ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి నల్ల నువ్వులను తీసుకోవడం కూడా చాలా సహాయపడుతుంది. నల్ల నువ్వులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.. ఇది కీళ్ల వాపును తగ్గిస్తుంది.. నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

నల్ల నువ్వులను ఎలా.. ఎప్పుడు తీసుకోవాలి?

నల్ల నువ్వులను పచ్చిగా తినవచ్చు లేదా కొద్దిగా కాల్చిన తర్వాత కూడా తినవచ్చు. ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో వీటిని తింటే చాలా మంచిది. మీరు సలాడ్, కూరగాయలు, నూడుల్స్ లేదా అన్నంలో కూడా నల్ల నువ్వులను జోడించవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..