Peppar Rice: నెలకి ఒకసారైనా తింటే ఆరోగ్యాన్ని ఇచ్చే మిరియాల అన్నం.. తయారీ ఎలా అంటే

Peppar Rice: రోజూ అన్నమేనా అంటూ.. పులిహోర, బిర్యానీ వంటి వాటిని తినే ఆహారంలో చేర్చుకున్నాం. అయితే ఇక నుంచి నెలకి ఒకసారైనా మిరియాల అన్నం..

Peppar Rice: నెలకి ఒకసారైనా తింటే ఆరోగ్యాన్ని ఇచ్చే మిరియాల అన్నం.. తయారీ ఎలా అంటే
Peppar Rice
Follow us

|

Updated on: Jun 09, 2021 | 4:11 PM

Peppar Rice: రోజూ అన్నమేనా అంటూ.. పులిహోర, బిర్యానీ వంటి వాటిని తినే ఆహారంలో చేర్చుకున్నాం. అయితే ఇక నుంచి నెలకి ఒకసారైనా మిరియాల అన్నం చేర్చుకోమంటున్నారు పౌష్టికాహార నిపుణులు. ఈ పెప్పర్ రైస్ ఘాటుగా ఉండడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది. జీర్ణక్రియ, దగ్గు మరియు సాధారణ జలుబు ఉపశమనంనకు సహాయపడుతుంది. ఈరోజు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే పెప్పర్ రైస్ తయారీ గురించి తెలుసుకుందాం..

మిరియాల అన్నం తయారీకి కావాల్సిన పదార్ధాలు:

పొడిపొడిగా ఉడికించిన అన్నం – కప్పు, శనగపప్పు – అరకప్పు, మిరియాలపొడి – రెండు చెంచాలు, పల్లీలు -అరకప్పు, పచ్చిమిర్చి – ఆరు, తాలింపు దినుసులు -ఒకటిన్నర చెంచా, కరవేపాకు రెబ్బలు – రెండు, కొబ్బరి తురుము – కొంచెం నూనె – సరిపడా పసుపు – చిటికెడు, ఉప్పు – రుచికి సరిపడా

పెప్పర్ రైస్ తయారీవిధానం :

అన్నాన్ని వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చుకోవాలి. శనగపప్పులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి తాలింపుగింజలు వేయించుకోవాలి. తరవాత పచ్చిమిర్చీ, కరివేపాకు, పల్లీలు వేయించాలి. ఇందులో ఉడికించిన శనగపప్పు, మరికొంచెం ఉప్పు, కొబ్బరి తురుము, మిరియాల పొడి వేసుకునిబాగా వేయించి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలిపితే మిరియాల రైస్ రెడీ.

Also Read: కోవిడ్ ఎఫెక్ట్.. ఆరు నెలలైనా తగ్గని జుట్టురాలే సమస్య.. వెంట్రుకలు పెరగడానికి వీటిని రోజు తీసుకోండి\