AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona-Hair Fall: కోవిడ్ ఎఫెక్ట్.. ఆరు నెలలైనా తగ్గని జుట్టురాలే సమస్య.. వెంట్రుకలు పెరగడానికి వీటిని రోజు తీసుకోండి

Covid-Hair Fall: చైనాలో వైరస్ భారత్ లోకి ప్రవేశించి దాదాపు ఏడాదిన్నర పైగా అయ్యింది. ఈ వైరస్ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఎన్నో కుటుంబాలు చిన్న..

Corona-Hair Fall: కోవిడ్ ఎఫెక్ట్.. ఆరు నెలలైనా తగ్గని జుట్టురాలే సమస్య.. వెంట్రుకలు పెరగడానికి వీటిని రోజు తీసుకోండి
Hair Fall
Surya Kala
|

Updated on: Jun 09, 2021 | 3:16 PM

Share

Covid-Hair Fall: చైనాలో వైరస్ భారత్ లోకి ప్రవేశించి దాదాపు ఏడాదిన్నర పైగా అయ్యింది. ఈ వైరస్ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఎన్నో కుటుంబాలు చిన్న పెద్దవారిని కోల్పోయాయి. మరి ఎందరో ఈ కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నా అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అధ్యయనం ప్రకారం కోవిడ్ యొక్క దీర్ఘకాలిక ప్రభావాలలో ఒకటిగా జుట్టు రాలడం అని తెలుస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత కూడా ఈ బాధితులు లక్షణాలను ఎదుర్కొంటున్నారని ఇటీవలి లాన్సెట్ అధ్యయనం పేర్కొంది. వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు జుట్టురాలడం సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపాయి.

ది లాన్సెట్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, చాలామందిలో COVID-19 నుంచి కోలుకున్న తర్వాత కూడా జుట్టు రాలుతుంది తెలుస్తోంది. చైనాలోని వుహాన్‌లో ఆసుపత్రిలో చేరిన 1,655 మంది రోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు పరిశోధకులు. వీరిలో 359 మంది (22%) డిశ్చార్జ్ అయిన ఆరు నెలల తర్వాత జుట్టు రాలడం ఎదుర్కొన్నారు. జుట్టు రాలడం పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. జుట్టు రాలడంతో పాటు అలసట లేదా కండరాల బలహీనత, నిద్ర ఇబ్బందులు, ఆందోలన, నిరాశ వంటి లక్షణాల ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉంటుందని అధ్యయన ఫలితాలు వెల్లడించాయి.

అయితే జుట్టు రాలడం తగ్గించుకోవాలంటే తగినంత పోషణ కావాలి.. ఈ సింపుల్ చిట్కాలను పాటించండి. కొన్ని పదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టుకి తగినంత పోషణ అందుతుంది. ఫలితంగా జుట్టు కుదుళ్లు గట్టిపడి వెంట్రుకలు రాలడాన్ని అరికడుతుంది.

గుడ్లు కరోనా నుంచి కోలుకున్నా జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్లు రోజూ తీసుకోవాల్సి ఉంది. గుడ్డులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. పచ్చసొనలో ఉండే విటమిన్స్, మినరల్స్ జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి.

కొబ్బరి నూనె ఒక స్పూన్ స్వచ్ఛమైన కొబ్బరి నూనెను పరగడుపు తీసుకోవాలి. ఇది వెంట్రుకల మొదళ్లను దృఢంగా మార్చుతుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

బాదం గింజలు, వాల్ నట్స్ రోజూ ఏడు బాదం గింజలు, రెండు వాల్ నట్స్ తీసుకోవాలి. బాదం గింజల్లో పుష్కలంగా లభ్యమయ్యే మెగ్నీషియం జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. దీంతో జుట్టు రాలే సమస్య అరికట్టబడుతుంది. వాల్ నట్స్‌లో ఉండే పొటాషియం కొత్త కణాల ఉత్పత్తికి సాయపడుతుంది.

చియా, గుమ్మడి, అవిసె గింజలు ఈ మూడు గింజలను ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. చియా గింజల్లోని ఫాస్పరస్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. గుమ్మడి గింజల్లో పొటాషియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. అవిసె గింజల్లో విటమిన్-ఇ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Also Read: స్త్రీలలో మెనోపాజ్ దశలో కలిగే లక్షణాలు.. నివారణకు సహజమార్గాలు..