Menopause: స్త్రీలలో మెనోపాజ్ దశలో కలిగే లక్షణాలు.. నివారణకు సహజమార్గాలు

Menopause: ప్రతి మహిళ జీవితచక్రంలో మెనోపాజ్ అనేది ఒక భాగం. ఈ దశలో స్త్రీలో అనేక ప్రతిచర్యలు చోటు చేసుకుంటాయి. అనేక మార్పులకు లోనవుతుంది...

Menopause: స్త్రీలలో మెనోపాజ్ దశలో కలిగే లక్షణాలు.. నివారణకు సహజమార్గాలు
Women's Menopause
Follow us

|

Updated on: Jun 09, 2021 | 2:29 PM

Menopause: ప్రతి మహిళ జీవితచక్రంలో మెనోపాజ్ అనేది ఒక భాగం. ఈ దశలో స్త్రీలో అనేక ప్రతిచర్యలు చోటు చేసుకుంటాయి. అనేక మార్పులకు లోనవుతుంది. మోనోపాజ్ 40 సంవత్సరం చివరిలో లేదా 50 సంవత్సరాల ప్రారంభంలో మొదలవుతుంది. ఈ దశ కొంతమందిలో చాల ఏళ్ళు ఉంటుంది. రుతుక్రమం ఆగిన మహిళల్లో చాలామందికి ఊబకాయం, గుండె జబ్బులు , మధుమేహం వంటి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే మహిళల్లో మెనోపాజ్ సంకేతాల నుండి ఉపశమనం కలిగించే కొన్ని సహజ పద్ధతులను పాటిస్తే,.. చాలా వరకూ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.

* ఎక్కువగా నీరు త్రాగాలి రుతుక్రమం ఆగిన మహిళల్లో డ్రై నెస్ అనేది ఒక సాధారణ సమస్య. తగినంత నీరు త్రాగటం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. నీరు హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. తరచుగా నీరు తాగడం వలన బరువు తగ్గుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. అందుకని మోనోపాజ్ దశలో ఉన్న మహిళలు తప్పని సారిగా రోజుకు 8–12 గ్లాసుల నీరు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనానికి 30 నిమిషాల ముందు 500 మి.లీ నీరు త్రాగాలని సిఫారసు చేస్తున్నారు.

* ఆరోగ్యకరమైన ఆహారం

మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పులు అనేక రుగ్మతలను ప్రేరేపిస్తాయి. వీటిని మంది ఆహారం తీసుకోవడంతో నియంత్రించవచ్చు. ముఖ్యంగా ఈ సమయం లో ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడే విటమిన్-డి మరియు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోమని ఇస్తున్నారు.

*క్రమం తప్పకుండా వ్యాయామం

రుతుక్రమం ఆగిపోయిన మహిళలు వారానికి మూడు గంటలు వ్యాయామం చేయడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం మరియు మొత్తం జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఒక అధ్యయనంలో తెలిసింది. శరీర బరువు నియంత్రించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి వ్యాయామం మోనోపాజ్ దశలోని మహిళలకు సహాయపడుతుంది. అదనంగా, యోగా మనోభావాలను నియంత్రించడంలో, శాంతిని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

* ప్రాసెస్ చేసిన ఆహారం మరియు రిఫైన్డ్ చక్కెరను తగ్గించండి ఋతుక్రమం ఆగిపోయిన మహిళల్లో డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతుందని ఒక అధ్యయనం తేల్చింది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులకు కారణం కావచ్చు. అప్పుడు వారిలో వికారం, చికాకు కలుగుతాయి.

* భోజనం వదిలివేయవద్దు

మెనోపాజ్ యొక్క లక్షణాలను తగ్గించడానికి ఎవరైనా క్యూరేటెడ్ డైట్ ను అనుసరిస్తున్నప్పుడు మధ్యలో మానకూడదు. అయితే ఎక్కువగా డైట్ లో కాల్షియం , ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఈ సహజమైన పద్దతులను పాటిస్తూ.. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే.. వైద్యుడిని సంప్రదించి తద్వారా మోనోపాజ్ సమయంలో ఉత్పన్నమయ్యే ఇతర సమస్యలను తగ్గించుకోవచ్చు .

Also Read:  పాదాల పగుళ్లతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను పాటించి చూడండి

Latest Articles
ఏపీ డీజీపీపై బదిలీ వేటు.. సీఎస్‎కు ఈసీ కీలక ఆదేశాలు..
ఏపీ డీజీపీపై బదిలీ వేటు.. సీఎస్‎కు ఈసీ కీలక ఆదేశాలు..
ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు కేటీఆర్ సాయం.. బ్రహ్మాజీ ఏమన్నాడంటే?
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు కేటీఆర్ సాయం.. బ్రహ్మాజీ ఏమన్నాడంటే?
కీళ్ల నొప్పులకు స్మోకింగ్‌కు మధ్య సంబంధం ఏంటి.? నిపుణులు మాట ఇదే.
కీళ్ల నొప్పులకు స్మోకింగ్‌కు మధ్య సంబంధం ఏంటి.? నిపుణులు మాట ఇదే.
మై డియర్‌ దొంగ పై అద్భుతమైన స్పందన.| మహేష్ మూవీకి ముహూర్తం.
మై డియర్‌ దొంగ పై అద్భుతమైన స్పందన.| మహేష్ మూవీకి ముహూర్తం.
మా ప్రేమకు పునాది అదే..: జ్యోతిక.| పెళ్లిపై తొలిసారి పరిణితి.
మా ప్రేమకు పునాది అదే..: జ్యోతిక.| పెళ్లిపై తొలిసారి పరిణితి.
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్‌ శ్రీను..
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్‌ శ్రీను..
ఆ 14 నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్ ఫోకస్.. అదనపు బలగాలతో పహారా
ఆ 14 నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్ ఫోకస్.. అదనపు బలగాలతో పహారా
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా మీద స్పెషల్ క్రేజ్..
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా మీద స్పెషల్ క్రేజ్..
మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఇందులో 'DATE' పదాన్ని గుర్తించండి చూద్దాం.
మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఇందులో 'DATE' పదాన్ని గుర్తించండి చూద్దాం.