AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cracked Heels: పాదాల పగుళ్లతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను పాటించి చూడండి

Cracked Heels: పురుషులతో పోలిస్తే.. మహిళలకె పాదాలపై పగుళ్లు ఎక్కువగా వస్తుంటా యి. కారణం మహిళలు ఎక్కువసేపు నీళ్లలో ఉంటూ పనులుచేయడం, పాదాలపై..

Cracked Heels: పాదాల పగుళ్లతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను పాటించి చూడండి
Cracked Heels
Surya Kala
|

Updated on: Jun 09, 2021 | 1:26 PM

Share

Cracked Heels: పురుషులతో పోలిస్తే.. మహిళలకె పాదాలపై పగుళ్లు ఎక్కువగా వస్తుంటా యి. కారణం మహిళలు ఎక్కువసేపు నీళ్లలో ఉంటూ పనులుచేయడం, పాదాలపై సరైన శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది. పగుళ్ల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పగుళ్లనుండి కొన్ని సందర్భాలలో రక్తం కారుతుంది. నడవడం కష్టంగా మారుతుంది. ఈ పగుళ్ల నివారణకు ఎక్కువగా మార్కెట్ లో లభించే క్రీములను ఆశ్రయిస్తారు.. ఆయితే వాటివలన సమస్య అప్పటి కప్పుడు తగ్గినా మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూనే అయితే పాదాల పగుళ్ల నివారణకు ప్రారంభ దశలో వైద్యులను సంప్రదించి మందులు వాడితే తగిన ఫలితం ఉంటుంది. అంతేకాదు ఇంటి చిట్కాలు పాటించినా చాలా వరకూ పాదాల పగుళ్ళను నివారించుకోవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో పాదాలు ఎక్కువగా పగులుతాయి. పాదాల పగుళ్ళు సాదారణంగా పొడి చర్మము ఉన్న వాళ్ళకి, మధుమేహ వ్యాధి గల వారికి ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు..

* ఇంటిపని, వంటపని చేస్తున్నప్పుడు మెత్తని స్పాంజ్ తో తయారు చేసిన స్లిప్పర్స్‌ వాడాలి. * రోజూ నిద్రించటానికి ముందు కాళ్ళను వేడి నీటితో శుభ్రపరుచుకుని తుడుచుకోవాలి. * పగుళ్ళపై కొబ్బరి నునేతో మృదువుగా మర్దన చేసి మందంగా ఉండే సాక్సులు ధరించాలి. * పాదాలను వారానికి ఒక్కసారి శుభ్రంగా సబ్బుతో కడగాలి. ఒక చెంచా క్యుటికల్ క్రిము లేదు రెండు చెంచాలా ఆలివ్‌ఆయిల్, రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కుల గ్లిజరిన్ బాగా కలిపి చేతులకు పాదాలకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో హెర్బల్ షాంపు వేసి 15 నిమిషాల పాటు నాన బెట్టాలి. ఇలా చేయడం ద్వారా పాదాలమీద వున్న మురికి అంతా మెత్తబడి తొలగిపోతుంది. * ప్రతిరోజూ ఉదయం పాత బ్రష్ తో రుద్ది గోరువెచ్చని నీటిలో కడిగితే మురికి, మ్రుతకనలు పోయి నున్నగా తయారవుతాయి. *అరటిపండును ముద్దగా చేసుకొని పగుళ్ళ పై రాసి పదినిముషాలు వుంచి తరువాత నీటితో శుభ్రపరచుకుంటే పాదాలు మెత్తబడతాయి. * ప్రతి రోజు సాయంత్రం రోజ్ వాటర్ ను పళ్ళెం లో వేసి పది నిముషాలు పాదాలు ముంచి ఉంచితే మృదువుగా తయారవుతాయి.

Also Read: మోనితతో రిలేషన్ గురించి దీపకు చెప్పాలనుకున్న కార్తీక్… సర్దుకుపొమ్మని భాగ్యం సలహా