Karthika Deepam: మోనితతో రిలేషన్ గురించి దీపకు చెప్పాలనుకున్న కార్తీక్… సర్దుకుపొమ్మని భాగ్యం సలహా

Karthika Deepam: దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారి ఫేవరేట్ సీరియల్ కార్తీక దీపం. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న ఈ కార్తీక దీపం సీరియల్ కు సెలబ్రెటీల నుంచి..

Karthika Deepam: మోనితతో రిలేషన్ గురించి దీపకు చెప్పాలనుకున్న కార్తీక్... సర్దుకుపొమ్మని భాగ్యం సలహా
Karthika Deepam

Karthika Deepam: దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారి ఫేవరేట్ సీరియల్ కార్తీక దీపం. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న ఈ కార్తీక దీపం సీరియల్ కు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ అభిమానులే. అందుకనే బుల్లి తెరపై వెయ్యి ఎపిసోడ్స్ దాటినా టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. దీప గురించి నిజం తెలుసుకున్న కార్తీక్. వీరిద్దరి కలవడానికి అడ్డుగా నిలిచిన మోనిత శాడిస్ట్ ప్రేమతో సరికొత్త కథనంతో సాగుతుంది. కార్తీక దీపం. ఈరోజు హైలెట్స్ ఏమిటో చూద్దాం..!

దీప మళ్ళీ శ్రీరామ్ బస్తీకి చేరుకుంది. వారణాసి ఇల్లు శుభ్రం చేస్తుంటే కార్తీక్ వస్తాడు. దీపతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు.. దీపని తీసుకెళ్లడానికి మాట్లాడుతుంటే.. దీప రిజెక్ట్ చేస్తుంది. కార్తీక్ దీపతో మాట్లాడుతూ.. నీ మనసులో ఏం ఉంది దీపా? నన్ను నువ్వు అనుమానిస్తున్నావా? ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు దీపా. అంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే.. దీప నీకు అన్యాయం చేయగలను ఈ తప్పు జరుగుతుందని.. అసలు ఆ రోజు మోనిత ఇంట్లో అంటూ చెప్పబోతే.. దీప ఏదోకటి మాట్లాడుతూ.. అడ్డుపడుతుంది. దీంతో అర్ధమైంది దీప నేను చెప్పినా నువ్వు వినిపించుకోవాలని అనుకోవడం లేదు.. అంటాడు. నన్ను అర్ధం చేసుకొనే
అవకాశమే లేదని తెలుస్తోంది. నీకంటే నేనే ఎక్కువ నష్టపోయాయను దీప వెళ్ళొస్తాను.. అంటూ కదులుతుంటే.. దీప ఈ ఇంట్లో నైనా ఆ ఇంట్లోనైనా మరెక్కడైనా భోజనం మాత్రం మనకండి అంటూ దీప ఇంట్లోకి వెళ్ళిపోతుంది.

దీప జీవితం కోసం మురళీ కృష్ణ బాధపడుతుంటే భాగ్యం వచ్చి .. దీప జీవితం నిలబడాలంటే రాజీపడి కలిసిపోవడం ఒక్కటే మార్గం అని చెబుతుంది. లేదంటే దీప జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. కొంచెం ఆలోచించయ్యా’ అంటుంది. అదీ నిజమే అంటాడు మురళీకృష్ణ.

మరోవైపు కార్తీక్ తన రూమ్ లో మోనిత ఇంట్లో తగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాడు. అద్దంలో చూసుకుని తనని తానె నిందించుకుంటాడు.. మమ్మీ అన్నట్లు నిజంగానే నువ్వు స్టుపిడ్ అనుకుంటాడు.. ఇంట్లో మోనిత ఓ వీడియో మెసేజ్ పంపిస్తుంది. నిన్ను చూడాలనిపిస్తుంది. కడుపులో ఉన్న బిడ్డ ఆడా, మగా తెలుసుకోవాలని ఉంది. కానీ తెలుసుకోను థ్రిల్ ఏముంటుంది. అయినా నాకు బాబే కావాలి.. బుల్లి కార్తీక్ కావాలి.. అంటుంది. వీడియో చూసిన కార్తీక్ రిప్లై ఇవ్వలేదని అందరి మగవాళ్లలా అవసరం తీరాక వదిలెయ్యాలనుకుంటున్నాడా… నా కార్తీక్ అలాంటి వాడు కాదు అని అనుకుంటుంది.

మరోవైపు దీప అన్నం వండుతూ.. కార్తీక్ దీప కాళ్ళమీద పడిన సన్నివేశం గుర్తు చేసుకుంటుంది. పిల్లలు వచ్చిన తర్వాత అమ్మ గురించి అడిగితె లేమిని చెబుతారు.. పిల్లల్ని తన దగ్గరకు పంపిస్తారా.. వాళ్ళని నేను ఏ లోటు లేకుండా పెంచుతాను అని ఆలోచిస్తున్న దీప దగ్గరకు మురళీ కృష్ణ వస్తాడు. అన్నం కూతురుతో కలిపి తింటాడు. భాగ్యం ఇచ్చిన సలహా చెప్పే ప్రయత్నం చేస్తే.. దీప వినకుంటా ఆపుతుంది.. నువ్వు నన్ను చూడాలనిపించినప్పుడు చూసి వెళ్ళు నాన్న అని చెబుతుంది.

సౌందర్య దిగులుగా మేడపైన నిలబడి ఉంటే అటుగా వచ్చిన కార్తీక్ .. తల్లిని చూసి తిరిగి వెళ్ళిపోబోతాడు.. కార్తీక్ ని దగ్గరికి రమ్మనమని పిలుస్తుంది. తలదించుకున్న కొడుకుని చూసి.. బాధగా సౌందర్య నా కొడుకు నా ముందు తలదించుకున్నాడు అని బాధగా మాట్లాడుతుంది..రేపటి ఎపిసోడ్ లో పిల్లలు ఇంటికి వస్తారు.. అమ్మ గురించి అడుగుతారు.. మరి కార్తీక్ ఏమని సమాధానం చెబుతాడో చూడాలి మరి

Also Read: సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక.. జూలై 1నుంచి అమల్లోకి సరికొత్త IFSC కోడ్ .. తెలుసుకోవడం ఎలా అంటే..