AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరరె.. మామిడిపండు తిని తొక్క పడేస్తున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

అవును మామిడి తొక్కలో పుష్కలమైన పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మామిడి తొక్కలో విటమిన్ ఎ , సి, కె, ఫోలేట్, మెగ్నీషియం, కోలిన్, పొటాషియం మాత్రమే కాకుండా ఫైబర్, మొక్కల సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. మామిడి తొక్క ప్రయోజనాలు, వాటితో ఎలాంటి వంటకాలు తయారు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం...

అరరె.. మామిడిపండు తిని తొక్క పడేస్తున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
Mango Peel
Jyothi Gadda
|

Updated on: May 17, 2025 | 10:01 PM

Share

ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్‌ నడుస్తోంది. వేసవి కాలంలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మామిడిలో అద్భుతమైన రుచితో పాటు, పోషకాలు కూడా సమృద్ధిగా నిండి ఉన్నాయి. అందుకే మనలో చాలా మంది మామిడి ప్రియులు ఉంటారు. అయితే, దాదాపు ప్రతి ఒక్కరూ మామిడి పండు లోపల గుజ్జు తినేసి, తొక్కలు పడేస్తుంటారు. కానీ ఈ మామిడి తొక్కలతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే షాక్‌ అవుతారు..అవును మామిడి తొక్కలో పుష్కలమైన పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మామిడి తొక్కలో విటమిన్ ఎ , సి, కె, ఫోలేట్, మెగ్నీషియం, కోలిన్, పొటాషియం మాత్రమే కాకుండా ఫైబర్, మొక్కల సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. మామిడి తొక్క ప్రయోజనాలు, వాటితో ఎలాంటి వంటకాలు తయారు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం…

మామిడి తొక్కలతో టీ.. మామిడి తొక్కతో టీ తయారుచేసుకోవచ్చు. మామిడి తొక్కలను నీటిలో ఉడికించాలి. దీంట్లో కొద్దిగా తేనె. నిమ్మరసం కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మామిడి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.

పచ్చడి.. కాయలతో పచ్చడి చేయడం చూశాం.. కానీ తొక్కలతో పచ్చడి చేయడం విన్నారా. తొక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఆవాలు పొడి, ఉప్పు, మిరప పొడి, నూనెతో కలిపి కొన్ని రోజులు మాగేలా ఉంచాలి. ఈ పచ్చడి భోజనంలో వేసుకుంటే రెండు ముద్దలు ఎక్కువ తింటారు.

ఇవి కూడా చదవండి

టీ.. రిఫ్రెషింగ్ టీ కోసం టీ తాగాలనుకునే వారు మామిడి పండు తొక్కతో కూడా టీ తాగవచ్చు. తొక్కలను ఎండబెట్టి మెత్తగా పొడి చేసి వేడి నీటిలో వేసి కాసేపు ఉడకనివ్వాలి. అనంతరం టీని తాగాలి. కొద్దిగా తేనె లేదా చక్కెర జోడించి తాగితే బాగుంటుంది.

జామ్.. మామిడి తొక్కలను ఉపయోగించి తియ్యనైన జామ్ తయారు చేసుకోవచ్చు. మామిడి తొక్కలను బాగా కడిగి మెత్తగా గ్రైండ్ చేయాలి. అనంతరం చక్కెర, నిమ్మరసంతో కలిపి మందమైన పాత్రలో ఉడికించాలి. ఈ జామ్‌ను బ్రెడ్‌, చపాతీతో తినవచ్చు.

స్మూతీ.. మామిడి తొక్కలతో స్మూతీని సులభంగా తయారు చేయవచ్చు. తొక్కలను బాగా కడిగి, పెరుగు, తేనె, ఇతర పండ్లతో కలిపి బ్లెండ్ చేయాలి. ఈ స్మూతీ విటమిన్లు, ఫైబర్‌తో నిండి ఉంటుంది, ఉదయం లేదా సాయంత్రం స్నాక్‌గా ఆదర్శంగా ఉంటుంది.

క్యాండీ.. తియ్యనైన క్యాండీని మామిడి పండ్లతో తయారు చేయవచ్చు. తొక్కలను సన్నగా కట్ చేసి చక్కెర సిరప్‌లో ఉడికించాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఎండబెట్టాలి. ఈ క్యాండీ సహజమైన తీపిని అందిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో