Arati Puvvu Curry Recipe: కోనసీమ స్టైల్‌లో రుచికరమైన అరటిపువ్వు కూర తయారీ విధానం..
Arati Puvvu Curry: మనిషికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతిలో లభించే ఆహారపదార్ధాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుతాయి. సీజన్ లో దొరికే పండ్లు, కూరగాయలు..
Arati Puvvu Curry: మనిషికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతిలో లభించే ఆహారపదార్ధాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుతాయి. సీజన్ లో దొరికే పండ్లు, కూరగాయలు తింటే చాలావరకూ వ్యాధులనుంచి రక్షణ పొందవచ్చు.. అలా అనేక వ్యాధులకు చెక్ పెట్టె ఆహారపదార్ధాల్లో ఒకటి అరటి పువ్వు. ఇది అనేక రోగాలకు ఔషధం వంటింది. ఈ అరటి పువ్వుతో ఆహారపదార్ధాలను ఎక్కువగా కోనసీమలో చేస్తారు. ముఖ్యంగా శనగపప్పు వడలు, కూరలు తయారు చేస్తారు. అయితే తమిళనాడులో కూడా అరటిపువ్వుతో వడని చేస్తారు. దీనిని వఝైపూ వడై అని పిలుస్తారు. ఈరోజు అరటిపువ్వుతో కూర తయారీ తెలుసుకుందాం
కావాల్సిన పదార్ధాలు:
అరటిపువ్వు – 1 బంగాళాదుంపలు కొబ్బరి తురుము లవంగాలు – 3 అల్లం కొంచెం జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ పంచదార – కొద్దిగా నెయ్యి పసుపు నూనె సరిపడినంత జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి 4 కారం కొంచెం ఉప్పు రుచికి సరిపడా కర్వేపాకు
తయారు చేయు పద్దతి:
ముందుగా అరటి పువ్వును లెటర్స్ గా తీసుకుంటూ.. వాటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఆ అరటిపువ్వు లెటర్స్ ని కట్ చేసుకుని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. బంగాళా దుంపలను, పచ్చిమిర్చి కట్ చేసుకుంది .. స్టౌ మీద బాణలి పెట్టి కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకుని వేడి ఎక్కిన తర్వాత బంగాళ దుంపలను ముక్కలను వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. అనంతరం పచ్చిమిర్చి , యాలకులు, లవంగాలు, జీలకర్ర, కర్వేపాకు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత అల్లం, కొబ్బరి వేసుకుని వేయించుకుని తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకుని వేగనివ్వాలి. ఆ మిశ్రమంలో వేయించుకున్న కొంచెం కారం , పసుపు వేసుకుని బంగాళ దుంపలను, ఉడికించుకున్న అరటిపువ్వు ముక్కలను కలిపి ఉడికించుకోవాలి. ఉడికిన అనంతరం కొంచెం నెయ్యి వేసుకుని రుచి చూసుకుని దింపేసుకోవాలి .అంతే కోనసీమ స్టైల్ లో ఎంతో టేస్టీ టేస్టీ అరటిపువ్వు మసాలా కూర రెడీ..
Also Read: కరోనా నిబంధనలు పాటిస్తూ.. బాలుడు ఓ రేంజ్ లో డ్యాన్స్.. ప్రతిభకు ఫిదా అంటున్న నెటిజన్లు