AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో ఈ పండ్లు తింటే.. గుండెకు చాలా మంచిది.. షుగర్‌ మీ కంట్రోల్‌లో..!

వేసవి కాలం వచ్చిందంటే అనేక ప్రత్యేక పండ్లను అందిస్తుంది. ఈ సీజన్‌లో వచ్చే పండ్ల కోసం ప్రజలు ఏడాది పొడవునా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అయితే, ఈ సీజన్‌లో లభించే అత్యంత ప్రత్యేకమైన పండు పండ్లలో రారాజు మామిడి. కానీ, ఈ సీజన్‌లో కేవలం 10 నుండి 20 రోజులు మాత్రమే మార్కెట్ వచ్చి పోయే ఒక పండు గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, ఒకసారి ఈ పండు రుచి చూశారంటే ఎప్పటికీ మర్చిపోలేరు. అంతేకాదు.. ఇది గుండెపోటును నివారించగల అత్యంత శక్తివంతమైన పండు. వారానికి ఒకసారి తిన్నా కూడా రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.

వేసవిలో ఈ పండ్లు తింటే.. గుండెకు చాలా మంచిది.. షుగర్‌ మీ కంట్రోల్‌లో..!
Phalsa Fruit
Jyothi Gadda
|

Updated on: Mar 17, 2025 | 3:19 PM

Share

డయాబెటిస్ బాధితులు ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తప్పని సరిగా తీసుకోవాలి. వీరు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. మధుమేహం ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలు తరచూ తక్కువగా, ఎక్కువగా ఉండటం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కానీ, ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..వేసవిలో షుగర్‌ బాధితులు వారి చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచే కొన్ని పండ్లను తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ప్రత్యేకమైన పండును తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు. అది ఫాల్సా..

ఫాల్సా.. ఒక రుచికరమైన తీపి పండు. ఇందులో విటమిన్లు, పొటాషియం, ఖనిజాలు, మెగ్నీషియం, భాస్వరం వంటి పోషకాలు ఉంటాయి. పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఫాల్సాలో కాల్షియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు కూడా ఉన్నాయి, ఇవి అనేక ఇతర విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తహీనతతో బాధపడేవారికి ఫాల్సా పండు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫాల్సా శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. విటమిన్ సి లోపాన్ని తీరుస్తుంది. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను సమానంగా ఉంచుతుంది.

ఇది మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఈ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమానంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని ఈ పండ్లు నియంత్రిస్తాయి. బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌ను చక్క బెట్టడానికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌. తద్వారా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇందులో శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అంతే కాదు, ఫల్సాలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా మెరిసేందుకు సహాయ పడుతుంది. వృద్ధాప్య ఛాయలను నెమ్మదిస్తుంది. విటమిన్‌ సి ఉండటం వల్ల కొల్లాజెన్‌ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. చర్మం మెరుస్తుంది. ఇందులో కొవ్వును తగ్గించే గుణాలు ఉన్నాయి. శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే గుండెకు మేలు. ఫాల్సాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. కూల్‌గా, సౌకర్యంగా ఉండేలా చేస్తుంది. హీట్‌ నుంచి ఇన్‌స్టెంట్‌ రిలీఫ్‌ వస్తుంది. ఈ పండ్లు తినడం వల్ల ప్రోటీన్లతో పాటు పొటాషియం కూడా అందుతుంది. ఇవి కండరాల ఆరోగ్యానికి అవసరం. కణజాలాలను రిపేర్‌ చేస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..