AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol: ఇదేందయ్యా ఇదీ.. మద్యం మానేస్తే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

జపాన్‌లో జీవనశైలిపై 10 సంవత్సరాల పాటు నిర్వహించిన అధ్యయనంలో మద్యం సేవించడం మానేసిన వారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని, మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నాయని తేలింది. మద్యం సేవించడం తాగుతున్న వారి కంటే మానేసిన వారిలో HDL (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) లేదా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా..

Alcohol: ఇదేందయ్యా ఇదీ.. మద్యం మానేస్తే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా?
Alcohol
Srilakshmi C
|

Updated on: Mar 17, 2025 | 2:03 PM

Share

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని పరిశోధనలు మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నాయి. అయితే ఇప్పుడు మరో కొత్త అధ్యయనం కొత్త చర్చకు దారితీసింది. మద్యం సేవించడం మానేసిన వారిలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయని పరిశోధనలో వెల్లడైంది. జపాన్‌లో జీవనశైలిపై 10 సంవత్సరాల పాటు నిర్వహించిన అధ్యయనంలో మద్యం సేవించడం మానేసిన వారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని, మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నాయని తేలింది. మద్యం సేవించడం తాగుతున్న వారి కంటే మానేసిన వారిలో HDL (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) లేదా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని తేలింది. అయితే దీనిపై మరింత అధ్యయనం చేయవల్సి ఉందని నిపుణులు అంటున్నారు. ఈ అధ్యయనం ఇంకా చివరి దశకు చేరుకోలేదని, భవిష్యత్తులో దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని అమెరికాలోని టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులతో సహా జపనీస్ పరిశోధకులు వెల్లడించారు. అక్టోబర్ 2012 నుంచి అక్టోబర్ 2022 వరకు దాదాపు 57,700 మందిపై సెంటర్ ఫర్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో నిర్వహించిన 3.2 లక్షలకు పైగా వార్షిక ఆరోగ్య పరీక్షల్లో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపారు.

మద్యపానం చేసేవారిలో మంచి కొలెస్ట్రాల్

ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధనలో.. మద్యం తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కొద్దిగా మెరుగుపడతాయని తేలింది. కానీ ఈ అలవాటు మానేసిన తర్వాత మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాయని పేర్కొంది.

అయితే ఆల్కహాల్‌ ఈ ప్రభావాలకు కారణమవుతుందని అధ్యయనం నేరుగా నిరూపించలేదు. కానీ కొలెస్ట్రాల్‌ను నిర్వహించడానికి ఆల్కహాల్ అలవాట్లను మార్చుకున్న తర్వాత లిపిడ్ ప్రొఫైల్‌లను పర్యవేక్షించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మద్యం సేవించడం మానేయడం వల్ల ఎల్‌డిఎల్-సి పెరుగుతుందని, అదే తరచూ మద్యపానం చేసే వారితో పోలిస్తే హెచ్‌డిఎల్-సి స్థాయిలు తగ్గుతున్నట్లు వారు తెలిపారు. మద్యం సేవించడం ప్రారంభించడం వల్ల మంచి కొలెస్ట్రాల్‌లో కొంత మెరుగుదల కనిపించవచ్చు. కానీ మద్యం మానేయడం వల్ల పెద్దగా మార్పు కనిపించకపోవచ్చని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరింత అధ్యయనం అవసరం.. ఇదే తుది వాదన కాదు

కెనడాలోని విక్టోరియా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్త, ప్రధాన పరిశోధకుడు టిమ్ స్టాక్‌వెల్ ప్రకారం.. మద్యం సేవించడం కొనసాగించే వ్యక్తులు సాపేక్షంగా ఆరోగ్యంగా ఉన్నారని ఫలితాలు చూపిస్తున్నాయి. జనవరి 2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో మద్యం వినియోగం విషయానికి వస్తే, ఆరోగ్యాన్ని ప్రభావితం చేయని సురక్షితమైన మొత్తం ఏదీ లేదని మరియు మరింత అధ్యయనం అవసరమని పేర్కొంది.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.