AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drumstick Benefits: మునగకాయతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే వదలిపెట్టే ప్రసక్తే ఉండదు..

ఉరుకులు.. పరుగుల జీవితం.. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ ప్రమాదాన్ని కొన్ని కూరగాయలతో దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పదార్థాలలో మునగకాయ ఒకటి.. ఇది అద్బుతంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు..

Drumstick Benefits: మునగకాయతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే వదలిపెట్టే ప్రసక్తే ఉండదు..
Drumstick Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: Sep 21, 2024 | 3:52 PM

Share

ఉరుకులు.. పరుగుల జీవితం.. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ ప్రమాదాన్ని కొన్ని కూరగాయలతో దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పదార్థాలలో మునగకాయ ఒకటి.. ఇది అద్బుతంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు.. మునగ చాలా సాధారణమైన కూరగాయ.. దీనిని భారతదేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలోనూ తింటారు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ రిసిపి సాంబార్‌లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. మునగ కూరతోపాటు ఫ్రై లాంటి స్పెషల్ వంటకాలను కూడా తయారుచేసుకోవచ్చు..

మునగకాయలో క్యాల్షియం, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రొటీన్లు, ఫైబర్, అనేక ముఖ్యమైన పోషకాలు ఈ కూరగాయలలో లభిస్తాయి. అందుకే.. మునక్కాయను సూపర్ ఫుడ్ కంటే తక్కువ కాదంటారు.. ఇంకా మునగకాయలతో పాటు ఆకులు, వేర్లు కూడా ఆరోగ్యానికి మంచివిగా భావిస్తారు. వీటిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. చాలామంది కాయలతోపాటు.. ఆకులను కూడా బాగా తింటారు. ఇంకా పువ్వులను కూడా తీసుకుంటారు. దీనిని సహజమైన ఔషధంగా పేర్కొంటారు.

మంచి ఆరోగ్యం కోసం..

మునగకాయను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటిడిప్రెసెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు దాని ఆకులు పచ్చిగా లేదా పొడిగా తీసుకోవచ్చు.. ఇంకా కాయలు తినవచ్చు. గుండె, మధుమేహ రోగులకు కూడా మునగ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మునక్కాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.. దీని కారణంగా రక్తహీనతను నయం చేయడానికి దీనిని ఎక్కువగా సిఫార్సు చేస్తారు.

మునగలో లభించే పోషకాలు..

విటమిన్ సి, విటమిన్ ఎ, క్యాల్షియం పుష్కలంగా ఉండే మునగలో అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. నారింజలో కంటే ఏడు రెట్లు విటమిన్ సి, క్యారెట్ కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్ సి లభిస్తుందని ఒక పరిశోధన వెల్లడించింది. ఈ అంశాలన్నీ ఆరోగ్యకరమైన శరీరానికి చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.

మునగకాయ అద్భుతమైన ప్రయోజనాలు..

  1. రోగనిరోధక శక్తి పెరుగుతుంది: మునగ లేదా దాని ఆకులను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని ఆకులలో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
  2. శక్తిని పొందుతారు: మునగకాయ తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఇది అలసట సమస్యను దూరం చేస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉన్న మునగ ఆకులు బలహీనతను తొలగించడంలో కూడా సహాయపడతాయి.
  3. ఎముకలు దృఢంగా మారతాయి: మునగ ఆకుల్లో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మునగ ఆకులు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.. ఇది ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధితో పోరాడటానికి కూడా మీకు సహాయపడుతుంది.
  4. మధుమేహం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది: మునగ ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. వీటిని తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. మునగలో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.
  5. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది: మునగ ఆకులను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మీ కొలెస్ట్రాల్ పెరిగితే అది రక్తనాళాలు గడ్డకట్టడానికి కారణమవుతుంది. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల మునగతో చేసిన ఆహారాలను ఎక్కువ తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

(ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. ఫాలో అయ్యేముందు డాక్టర్లను సంప్రదించండి)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..