Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajwain Water: వాము నీరు తాగితే.. ఎంతటి వారైనా నెలలో 5 కేజీలు తగ్గడం ఖాయం.. మరి ఎలా తాగాలంటే..

Ajwain Water: ఒకప్పుడు ఒళ్ళు వేడిగా ఉందని తాకి చూసి మరీ కాలిపోతుంటే నొసటి పై తడిగుడ్డ ..వేయమని.. లేదంటే ఐస్ తో రుద్దమని .. జ్వరం వచ్చిన రోగికి బార్లీ నీళ్లు..

Ajwain Water:  వాము నీరు తాగితే.. ఎంతటి వారైనా నెలలో 5 కేజీలు తగ్గడం ఖాయం.. మరి ఎలా తాగాలంటే..
Ajwain Water
Follow us
Surya Kala

|

Updated on: Jun 06, 2021 | 3:30 PM

Ajwain Water: ఒకప్పుడు ఒళ్ళు వేడిగా ఉందని తాకి చూసి మరీ కాలిపోతుంటే నొసటి పై తడిగుడ్డ ..వేయమని.. లేదంటే ఐస్ తో రుద్దమని .. జ్వరం వచ్చిన రోగికి బార్లీ నీళ్లు ఇస్తూ పత్యం చేయించి ..చల్ల బడింది అని తెలిసిన తర్వాత చారు అన్నం లేదా శొంఠిపొడి అన్నం ..అజీర్ణం అయితే వాము అన్నం తినిపించే సంస్కృతి మనది. ఆసియా ఖండంలో, మరీ ముఖ్యంగా రాజస్థాన్‌లో విరివిగా పండించే వాములో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. జీర్ణ సమస్యలకు విరుగుడుగా కొద్దిగా వాముని వేడినీళ్లలో కలిపి తీసుకోవడం మనకు సాధారణ విషయం. జీలకర్ర ,అనిపించినా దానికంటే కొంచెం చూడడానికి చిన్నడిగానే ఉంటుంది. ఎన్నో సమస్యలకు వాము నీతితో చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ ఔషదాన్ని అజ్వైన్(Ajwan)లేదా వాము అని అంటారు.

వాము వాటర్ తయారీ :

ఈ వామునీటిని తయారు చేసుకోవడం కూడా సులభమే. ముందుగా రెండు టీస్పూన్ల వాముని దోరగా వేయించి, దాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. తర్వాత ఆ వాముని ఉడికించి, వడగట్టి, ఆ వాటర్ చల్లారిన తర్వాత తాగాలి.

మనం మన ఇంట్లోనే ఉండే ఒక అద్భుతమైన ఔషధం వాము. దీనిని సరైన పద్ధతిలో తీసుకుంటే ఎంతటి లావు శరీరం కలవారైనా ఖచ్చితంగా సన్నబడతారు. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మీ శరీరంలో ఎటువంటి నొప్పులతో ఉన్నా ఈ వాము నీరు పనిచేస్తుంది.

రోజు ఉదయమే వాము నీరు తాగితే ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పొట్ట తగ్గుతుంది. రోజూ పరగడుపునే వాము నీరు తాగితే.. ఒక్క నెలలో 5 నుంచి 10 కిలోలు తగ్గుతారు. ఆరు నెలలు క్రమం తప్పకుండా తీసుకుంటే మీరు వంద కిలోల అయినా ఈజీగా 70 నుంచి 75 కిలోల లోపు వచ్చేస్తారు ఎందుకంటే లావు తగ్గడానికి వాము చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కడుపులో గ్యాస్ సమస్య మలబద్ధకం ఎలాంటి కడుపునొప్పి సమస్య అయినా సరే చాలా బాగా నయం చేస్తుంది.

* ప్రస్తుతం కాలంలో ఎక్కువ మంది అసిడిటీతో బాధపడుతున్నారు. అటువంటి వారికి వాము నీరు మంచి ఔషధం. సమయానికి భోజనం చేయకపోవడం, ఎక్కువ కారంగా ఉండే ఆహారాలను తీసుకోవడంతో పాటు ఒత్తిడి కూడా అసిడిటీకి గల ప్రధాన కారణాలు. వాము నీరు తీసుకుంటే ఈ లక్షణాలు ఉపశమిస్తాయి.

* వాము నానబెట్టిన నీటిని ప్రతి రోజూ ఉదయం తీసుకుంటే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఉన్న రాళ్లు కరుగుతాయి. వాముని వెనిగర్‌ లేదా తేనెతో కలిపి వారం రోజులు తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్లు మూత్రం ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది.

*దగ్గుకు దివ్య ఔషధం వాము. 1/2 టీ స్పూన్ వాము, రెండు లవంగాలు, చిటికెడు ఉప్పును కలిపి చూర్ణం చేసి అరకప్పు వేడి నీళ్లలో కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తూ తాగితే దగ్గు తగ్గుతుంది.

* పూర్వకాలంలో భారతదేశంలో గర్భం దాల్చిన స్త్రీలను వామునీరు తాగే వారు. గర్భధారణ మూలంగా కలిగే మలబద్దకం, ఉబ్బరానికి వాము గొప్ప ఔషధం. ప్రసవానంతరం కూడా జీర్ణసమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, పాలు పట్టేందుకు, గర్భాశయాన్ని శుభ్రపరిచేందుకు వాము తీసుకోవాలని పెద్దలు చెప్తారు.

Also Read: కేంద్రానికి, ట్విట్టర్ కు మధ్య పోరు..ప్రత్యామ్నాయం ఎదగడానికి ‘కూ’ ప్రయత్నాలు.. ఇప్పటికే నైజీరియాలో అందుబాటులో ఉన్నట్లు ప్రకటన