AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken: స్కిన్‌తో కోడికూర తింటే ఎన్నో ప్రయోజనాలు.. కనీసం మీ ఊహకు కూడా అందవు

షాపుకి వెళ్తాం.. కావాల్సినంత చికెన్ ఆర్డర్ చేస్తాం. అయితే గతంలో విత్ స్కిన్ ఆర్ విత్ అవుట్ స్కిన్ అని అడిగేవారు షాపు వాళ్లు. అయితే ఇప్పుడు కొనుగోలుదారులే రేర్‌గా మాకు స్కిన్‌తో చికెన్ కావాలి అని అడుగుతున్నారు.

Chicken: స్కిన్‌తో కోడికూర తింటే ఎన్నో ప్రయోజనాలు.. కనీసం మీ ఊహకు కూడా అందవు
Chicken Skin On
Ram Naramaneni
|

Updated on: Feb 27, 2022 | 2:26 PM

Share

Indian chicken recipes: షాపుకి వెళ్తాం.. కావాల్సినంత చికెన్ ఆర్డర్ చేస్తాం. అయితే గతంలో విత్ స్కిన్ ఆర్ విత్ అవుట్ స్కిన్ అని అడిగేవారు షాపు వాళ్లు. అయితే ఇప్పుడు కొనుగోలుదారులే రేర్‌గా మాకు స్కిన్‌తో చికెన్ కావాలి అని అడుగుతున్నారు. మున్ముందు చికెన్‌ను స్కిన్‌తో కలిపి తినేవారు అంటే నమ్మరేమో అన్న పరిస్థితులు వచ్చాయి. అవును ఇప్పుడు అందరూ స్కిన్ లెస్‌ చికెన్‌కు అలవాటుపడ్డారు. గ్రామాల్లో కూడా అందరూ స్కిన్ లెస్ చికెన్ తింటున్నారు. గతంలో కోడిని హెయిర్ మొత్తం తీసేసి.. నీట్‌గా కాల్చి చికెన్ కొట్టేవారు. అలా తింటే ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు అంత టైమ్ లేదు.. దీంతో స్కిన్ లెస్ చికెన్‌కు వైపు మళ్లారు జనాలు. స్కిన్‌లెస్ వైపు మొగ్గు చూపించడానికి అపోహలు కూడా ఒక కారణం. కోడి చర్మం తినడం వల్ల శరీరంలో కొవ్వు(Fat) చేరుతుందని ప్రచారం ఉంది. అయితే ఇది ఎంతమాత్రం నిజం కాదంటున్నారు నిపుణులు. హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(Harvard School of Public Health) సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. కోడి స్కిన్‌లో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి రక్త పోటును నియంత్రిస్తాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే స్కిన్‌తో పాటు కోడిని తినాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా కోడిని హెయిర్ తీసేసిన తర్వాత బాగా కాల్చాలి. ఆపై కాస్త పసుపు పూయాలి. ఇలా చేయడం ద్వారా.. కోడి శరీరంపై ఉండే అన్ని రకాల సూక్ష్మజీవులు మరణిస్తాయి. పల్లెటూర్లలో ఈ పద్దతిని ఫాలో అవుతారు.

అయితే సిటీల్లో ఈ తరహా విధానం ఉండదు. స్కిన్‌తో చికెన్ కావాలంటే.. షాపు వాళ్లు.. వేడి నీటిలో కాసేపు ఉంచుతారు. ఇలా చేయడం ద్వారా కూడా సూక్ష్మజీవులు నశిస్తాయి. మరీ అంత డౌట్ ఉంటే.. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చికెన్ పీసులను.. కాసేపు వేడి నీళ్లలో ఉంచండి. అయితే ఏది అయినా సరే మితంగా ఉంటే మంచిది. అదే పనిగా డైలీ స్కిన్‌తో చికెన్ తింటే.. ఒంట్లో భారీగా కొవ్వు చేరుతుంది. ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు కూడా పరిధికి మించి బాడీలో చేరుతాయి. ఇలా జరిగితే ఇన్ ఫ్లమ్మేషన్ రావచ్చు. కాబట్టి వారానికి ఒకసారో, రెండు సార్లో స్కిన్ తో వండి చికెన్ కూరను ఆస్వాదించవచ్చు.

(గమనిక: అందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.)

Also Read: గుండెపోటుకు ముందు కనిపించే సంకేతాలు ఇవే.. ఈ సమయాల్లో జాగ్రత్త

అందంతో గుండెల్లో హీట్ పుట్టించగలదు.. శివంగిలా ఫైట్ చేయగలదు.. ఎవరో గుర్తించారా..?