Lifestyle: వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఇబ్బందులా.. ఇలా చేయండి..

ప్రస్తుతం మార్కెట్లోకి ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సింగ్‌ కూడా ఇప్పుడు ఇంట్లోనే చూసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వ్యాక్సింగ్ చేసుకునే సమయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వేసవిలో చర్మసంబంధిత సమస్యలు వస్తుంటాయి. సమ్మర్‌లో వ్యాక్సింగ్‌ చేసుకున్న తర్వాత..

Lifestyle: వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఇబ్బందులా.. ఇలా చేయండి..
Waxing
Follow us

|

Updated on: Apr 30, 2024 | 6:23 PM

ప్రస్తుతం మార్కెట్లోకి ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సింగ్‌ కూడా ఇప్పుడు ఇంట్లోనే చూసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వ్యాక్సింగ్ చేసుకునే సమయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వేసవిలో చర్మసంబంధిత సమస్యలు వస్తుంటాయి. సమ్మర్‌లో వ్యాక్సింగ్‌ చేసుకున్న తర్వాత చర్మంపై దురద, చిన్న చిన్న మొటిమలు వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే కొన్ని రకాల నేచురల్ చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వ్యాక్సింగ్‌ తర్వాత చర్మంపై ఎలాంటి సమస్య రాకుండా చేయడంలో అలోవేరా జెల్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందుకోసం వ్యాక్సింగ్ పూర్తికాగానే చర్మానికి అలోవెరా జెల్‌ను అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం స్మూత్‌గా మారుతుంది. ఇరిటేషన్‌, దురద వంటి సమస్యలు దూరమవుతాయి.

* ఇక కొందరిలో వ్యాక్సింగ్‌ చేసుకోగానే చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి వారు కొబ్బరి నూనెను అప్లై చేసుకుంటే మెరుగైన ఫలితం పొందొచ్చు. అలాగే అలర్జీ నుంచి కూడా తప్పించుకోవచ్చు.

* ఇక ఆలివ్‌ ఆయిల్ కూడా చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వాక్సింగ్ తర్వాత చర్మ సమస్యలు వేధిస్తుంటే ఆలివ్‌ ఆయిల్‌తో మర్ధన చేసుకోవాలి. అనంతరం కొన్ని గంటల తర్వాత నీటితో కడిగేస్తే సరిపోతుంది. మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.

* అంతేకాకుండా వ్యాక్సింగ్ పూర్తి కాగానే మాయిశ్చరైజర్‌ని సరిగ్గా అప్లై చేయాలి. ఇది దురద, చికాకు వంటి సమస్యలుఏ రాకుండా చేస్తుంది. రాత్రంతా ఉంచితే మరీ మంచిది. దీనివల్ల ముఖ్యంగా దురద సమస్య తీరుతుంది.

* ఐస్‌ క్యూబ్స్‌ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాక్సింగ్‌ పూర్తి కాగానే ఆ ప్రదేశంలో ఐస్‌ను రుద్దడం వల్ల చికాకు, దురద వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ