AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: వేసవిలో అరటిపండ్లు నల్లగా మారకుండా తాజాగా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

అరటిపండ్లు ఏడాదిపొడవునా లభిస్తాయి. అందుకే చాలా మంది తమ ఇళ్లలో ఎలాంటి పండ్లు లేకపోయినా అరటిపండు మాత్రం కనిపిస్తుంది.

Kitchen Hacks: వేసవిలో అరటిపండ్లు నల్లగా మారకుండా తాజాగా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..
Kitchen Hacks
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: May 31, 2023 | 11:15 AM

Share

అరటిపండ్లు ఏడాదిపొడవునా లభిస్తాయి. అందుకే చాలా మంది తమ ఇళ్లలో ఎలాంటి పండ్లు లేకపోయినా అరటిపండు మాత్రం కనిపిస్తుంది. తక్కువ ధరకే లభించే అరటిపండ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చల్లని వాతావరణం ఉన్నప్పుడు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు వేధిస్తున్నప్పుడు అరటిపండు తినకూడదని వైద్యులు చెబుతుంటారు. అయితే కొంతమంది డజన్ల కొద్దీ అరటిపండ్లను కొనుగోలు చేస్తుంటారు. ప్రతిరోజూ ఒక అరటిపండు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఈ వేసవిలో అరటిపండ్లు తొందరగా రంగు మారుతుంటాయి. ఒకరోజులోనే నల్లగా మారి, పాడవుతుంటాయి. మరి అరటిపండ్లు తాజాగా ఉండి..రంగు మారకుండా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.

ప్రస్తుతం ఎండాకాలం కావడంతో అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. పండ్లు త్వరగా పాడవుతాయి. అధిక ఉష్ణోగ్రత కారణంగా, అరటి త్వరగా నల్లగా మారుతుంది. ముడుచుకోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల దాన్ని విసిరేయడం తప్ప మరో మార్గం లేదు. ఇంత డబ్బు పెట్టి తెచ్చుకున్న అరటిపండును పారేయడం ఎవరికీ ఇష్టం ఉండదు. దాని కోసం, మీరు అరటిపండ్లను విసిరేయకుండా వాటిని తాజాగా ఎలా ఉంచవచ్చో తెలుసుకోండి.

అరటిపండ్లను విడిగా ఉంచండి:

ఇవి కూడా చదవండి

చాలా మందికి అరటిపండ్లను ఇతర పండ్లతో కలిపి ఉంచే అలవాటు ఉంటుంది, వాటిని ముందుగా మార్చాలి. అరటిపండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఇతర పండ్లతో ఉంచకూడదు. అరటిపండ్లను వేలాడదీయాలి. మీరు దుకాణాల్లో అరటిపండ్లు వేలాడదీయడం కూడా చూసి ఉండవచ్చు. అరటిపండ్లను వాటి కాండంతో ప్రత్యేక స్టాండ్‌లలో ఉంచాలి. ఇలా చేస్తే అరటిపండ్లు పాడవకుండా 4-5 రోజులు తాజాగా ఉంటాయి.

 వెనిగర్ తో కడగాలి:

అరటిపండ్లు త్వరగా పాడవకుండా ఉండాలంటే వాటిని కుకింగ్ వెనిగర్ తో కడగాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మీరు కూడా ఈ ట్రిక్ ప్రయత్నించాలనుకుంటే, వెనిగర్, నీటితో అరటిని కడగాలి.

 ప్లాస్టిక్‌లో చుట్టండి:

అరటిపండ్లు కుళ్ళిపోకుండా నిరోధించడానికి ఉత్తమ మార్గం వాటిని ప్లాస్టిక్ ర్యాప్‌లో ఒక్కొక్కటిగా చుట్టడం. ఇలా చేస్తున్నప్పుడు, ప్లాస్టిక్‌ను అరటిపండు కాండం చివర మాత్రమే చుట్టాలని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల అరటిపండు 4-5 రోజులపాటు తాజాగా ఉండేలా ఇథిలీన్ అనే గ్యాస్ తక్కువ మొత్తంలో విడుదలవుతుంది.

అరటిపండ్లను కొనుగోలు చేసేటప్పుడు దీన్ని గుర్తుంచుకోండి:

వేసవిలో అరటిపండ్లను కొనుగోలు చేసేటప్పుడు అవి చాలా పండినవి కావు అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఎందుకంటే పూర్తిగా పండిన అరటిపండు ఒక్కరోజులో త్వరగా పాడైపోతుంది. అదేవిధంగా కాస్త పండిన అరటిపండు కొంటే నాలుగైదు రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఎప్పుడూ కాస్త గట్టిగా ఉండే అరటిపండ్లను కొనండి. ఇది నిల్వ చేయడం సులభంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ సంబంధిత వార్తల కోసం