AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Powder: నకిలీ టీ పౌడర్‌ను ఎలా గుర్తించాలో తెలుసా.? ఈ సింపుల్‌ ట్రిక్‌తో ఇట్టే..

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఉదయాన్నే లేవగానే ఉపయోగించే పాల నుంచి మొదలు ప్రతీ వస్తువును కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ, కాసుల కక్కుర్తి కోసం చేయకూడని పనులు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో నకిలీ టీపొడి తయారు చేస్తున్న ముఠా గుట్టరట్టైన విషయం తెలిసిందే...

Tea Powder: నకిలీ టీ పౌడర్‌ను ఎలా గుర్తించాలో తెలుసా.? ఈ సింపుల్‌ ట్రిక్‌తో ఇట్టే..
Fake Tea Powder
Narender Vaitla
|

Updated on: Oct 11, 2024 | 7:52 PM

Share

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఉదయాన్నే లేవగానే ఉపయోగించే పాల నుంచి మొదలు ప్రతీ వస్తువును కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ, కాసుల కక్కుర్తి కోసం చేయకూడని పనులు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో నకిలీ టీపొడి తయారు చేస్తున్న ముఠా గుట్టరట్టైన విషయం తెలిసిందే.

సనత్‌నగర్‌లో ఈ నకిలీ టీ పౌడర్‌ తయారీ సాగుతోంది. తాజాగా ఈ కంపెనీపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్‌ నకిలీ టీ పౌడర్‌ను తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు పక్కన ఉండే టీ షాపులను లక్ష్యంగా చేసుకొని తక్కువ ధరకే టీపౌడర్‌ను విక్రయిస్తున్నారు. అయితే ఈ టీపౌడర్‌ను కొబ్బరి పీచు, చెక్కపొడితో చేస్తుండం గమనార్హం. ఈ నేపథ్యంలో మార్కెట్లో మీరు కొనుగోలు చేస్తున్న టీ పౌడర్‌ కల్తీదా.? అసలైందా.? ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* మీరు ఉపయోగిస్తున్న టీ పౌడర్‌ అసలైందేనా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే. ముందుగా ఒక స్టీల్‌ గిన్నెలో కొద్దిగా నిమ్మరసం వేయాలి. అనంతరం ఆ నిమ్మరసంలో కొంత టీ పౌడర్‌ను వేయాలి. ఒకవేళ టీ పౌడర్‌ రంగు మారితే అది నకిలీ అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ నారింజ లేదా ఇతర రంగు వస్తుంటే అది నకిలీ అని అర్థం. ఒకవేళ పచ్చ లేదా పసుపు కలిసిన నారింజ రంగు వస్తే అది ఒరిజినల్‌ అని అర్థం చేసుకోవాలి.

* ఇక టీ పౌడర్‌ నాణ్యతను తెలుసుకునే మరో టెక్నిక్‌ విషయానికొస్తే. ముందుగా ఓ గ్లాసు చల్లటి నీళల్లో రెండు స్పూన్ల తేయాకు కలపాలి. నిమిషం తర్వాత నీళ్లలో రంగు తేలితే..ఆ టీ పొడి నకిలీ అని అర్దం చేసుకోవాలి. నెమ్మదిగా రంగు పోతుంటే మాత్రం టీ పొడి అసలైందని అర్ధం.

* టిష్యూ పేపర్‌ సహాయంతో కూడా టీ పొడి నాణ్యతనుతెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. ముందుగా ఒక టీష్యూ పేపర్‌ తీసుకోవాలి. పేపర్‌లో రెండు స్పూన్ల టీ పొడి వేసి అందులో కొన్ని చుక్కలు నీళ్లు వేసి ఎండలో పెట్టాలి. కాసేపటి తర్వాత టిష్యూ పేపర నుంచి టీ పొడి వేరి చేసి చూడాలి. ఒకవేళ టిష్యూ పేపర్‌పై మరక ఉంటే ఆ టీ పొడి నకిలీ అని అర్థం. లేదంటే అసలైందని అర్థం చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..