Stress: ఆందోళన, ఒత్తిడితో చిత్తవుతున్నారా.? 3-3-3 నియమాన్ని పాటించండి..

ప్రస్తుతం ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలకే తీవ్రమైన ఆందోళనతో బాధపడుతున్నారు. అయితే ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడేందుకు ఒక సింపుల్ చిట్కా ఉంది. ఇంతకీ ఏంటా టెక్నిక్.? దీనివల్ల ఆందోళన ఎలా దూరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Stress: ఆందోళన, ఒత్తిడితో చిత్తవుతున్నారా.? 3-3-3 నియమాన్ని పాటించండి..
Anxiety
Follow us

|

Updated on: Oct 18, 2024 | 3:44 PM

ఒకప్పుడు మనుషులు శారీరకంగా ఎక్కువ శ్రమ చేసే వారు, శారీరకంగా ఒత్తిడి ఎక్కువగా పడేది. కానీ ప్రస్తుతం శారీరర శ్రమ తగ్గింది, మానసిక ఒత్తిడి పెరిగింది. నిత్యం ఏదో ఒక అంశంపై విపరీతమైన ఆందోళన, ఒత్తిడికి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ కష్టాలు.. ఇలా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీసేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.

నిజానికి ఇలా దీర్ఘకాలంగా ఆందోళన, ఒత్తిడితో బాధపడడం ఒక మానసిక రుగ్మతగా చెబుతుంటారు. ఇది నిద్రపై ప్రభావితం పడుతుంది. కంరాల ఒత్తిడిని పెంచుతుంది. జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. చిరాకు, ఏకాగ్రత కోల్పోవడం, రక్తపోటు ఇలా చెప్పుకుంటూ పోతే ఒత్తిడి వల్ల ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతాయి. ఓ అధ్యయనం ప్రకారం.. దేశంలో దాదాపు 88% మంది ప్రజలు ఏదో ఒక రకమైన ఆందోళనతో బాధపడుతున్నారు. అంటే ప్రతి 100 మందిలో 88 మంది ఈ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాంటే 3-3-3 నియమాన్ని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ నియమమం, దీనివల్ల మానసిక ఒత్తిడి ఎలా దూరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

3-3-3 నియమం ముఖ్య ఉద్దేశంలో మీరు మీ మనసులోకి కొన్ని విషయాలను తీసుకురావాలి. చూడటం, వినడం, చేయడం ఈ మూడింటిపై శ్రద్ధ పెట్టాలి. తీవ్రమైన ఒత్తిడితో బాధపడేవారు ముందుగా కళ్లు మూసుకొని ప్రశాంతంగా ఉండాలి. అనంతరం మీ చుట్టూ వినిపిస్తున్న శబ్ధాలను జాగ్రత్తగా గుర్తించి, ఆ శబ్ధాలు ఏంటో గుర్తించడానికి ప్రయత్నించాలి.

అనంతరం శరీరంలో ఏవైనా మూడు భాగాలను ప్రయత్నించడానికి ప్రయత్నించండి. కాలివేళు, చేతి వేళు, ముక్కు ఇలా అన్ని భాగాలపై ఏకాగ్రతను పెంచుకోవాలి. ఇక మూడు మీ ముందు ఏవైనా మూడు వస్తువులను పెట్టుకొని వాటిని చేత్తో తాకాలి. పూర్తిగా కళ్లు మూసుకొని ఆ వస్తువుల ఆకారం ఎలా ఉంది.? వాటిని దేనితో తయారు చేశారన్న విషయాలను మనసులో స్మరించుకోండి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ ఆందోళన దూరమై, ఒక పాజిటివ్‌ ఆలోచన వస్తుంది. ప్రశాంతంగా ఉన్న అనుభూతిని పొందుతారు. ఇలా ఏదైనా ఒక వస్తువు లేదా ఒక శబ్ధాన్ని వినడం వల్ల మీలోని ఆందోళన దూరమవుతుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..