Flax Seeds: అవిసెగింజలు ఆరోగ్యానికి మేలే కాదు కీడు తలపెడతాయి? ఈ విషయాలు తెలుసుకోండి..

తృణ ధాన్యాల్లో ఫ్లాక్స్ సీడ్ ముఖ్యమైనవి. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా అవిసె గింజల్లో సర్వింగ్ ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. వీటిల్లో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా..

Flax Seeds: అవిసెగింజలు ఆరోగ్యానికి మేలే కాదు కీడు తలపెడతాయి? ఈ విషయాలు తెలుసుకోండి..
Flax Seeds Health Benefits
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 10, 2023 | 1:44 PM

తృణ ధాన్యాల్లో ఫ్లాక్స్ సీడ్ ముఖ్యమైనవి. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా అవిసె గింజల్లో సర్వింగ్ ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. వీటిల్లో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్‌ కారణంగా ఊబకాయంతో బాధపడే వారిలో లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచడంలో అవిసె గింజలు కీలకపాత్ర పోషిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు . ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

అవిసె గింజలను తినడం వల్ల కలిగి ఇతర ప్రయోజనాలు ఇవి..

  • అవిసె గింజల్లో ఏఎల్‌ఏ పుష్కలంగా ఉంటుంది. ఏఎల్‌ఏ అనేది ఓ రకమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్. ఇది గుండె ఆరోగ్యానికి హతోధికంగా తోడ్పడుతుంది.
  • క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో సహాయపడే లిగ్నాన్స్ అనే పోషకాలు వీటిల్లో ఉంటాయి.
  • అవిసె గింజలు జీర్ణ శక్తిని ప్రోత్సహించడానికి, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
  • అవిసె గింజల్లో ఉండే అధిక ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  • అధిక రక్తపోటు ఉన్నవారికి బీపీ కంట్రోల్‌లో ఉంచడానికి ఉపయోగపడుతుంది.
  • అవిసె గింజల్లో ఉండే ఫైబర్ కంటెంట్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
  • ఆహారంలో భాగంగా అవిసె గింజలు తింటే ఎక్కువసేపు నిండుగా అనిపించి ఆకలి లేకుండా చేస్తుంది. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి సహాయపడుతుంది.

అయితే అవిసె గింజలను మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్యంపై కొన్ని దుష్ప్రభావాలు చూపుతుంది. అవేంటంటే..

అవిసె గింజలు ఎప్పుడు పరిమిత మోతాడులోనే తీసుకోవాలి. ఒక్కోసారి వీటి వినియోగం అలెర్జీలకు దారితీస్తుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌కు కారణం అవుతుంది. అవిసె గింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే కడుపు నొప్పి, అతిసారం, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఒక రోజులో ఎంత మోతాదులో అవిసె గింజలు తీసుకోవాలంటే..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ కేవలం 1 టీస్పూన్ (7 గ్రాములు) అవిసె గింజలు కనిస్ఠంగా తీసుకుంటే మంచిది. గరిష్ఠంగా రోజుకు 4 నుంచి 5 వరకు టీస్పూన్లు (28-35 గ్రాములు) తీసుకోవచ్చు. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు.

ఇవి కూడా చదవండి

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.