ఇవి జస్ట్ ఆకులేగా అనుకునేరు.. పవర్‌ఫుల్.. డయాబెటిస్ సహా ఆ సమస్యలకు రామబాణం..
ఉరుకులు, పరుగుల జీవితంలో డయాబెటిస్, బీపీ సహా ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.. ఇందుకోసం జీవనశైలి, ఆహారం విషయంలో మార్పులు చేసుకుంటే.. పలు సమస్యల నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. మంచి కూరలతో కూడా మనం మన ఆరోగ్యాన్ని రిపేర్ చేసుకోవచ్చు..

ఉరుకులు, పరుగుల జీవితంలో డయాబెటిస్, బీపీ సహా ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.. ఇందుకోసం జీవనశైలి, ఆహారం విషయంలో మార్పులు చేసుకుంటే.. పలు సమస్యల నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. మంచి కూరలతో కూడా మనం మన ఆరోగ్యాన్ని రిపేర్ చేసుకోవచ్చు.. ఆకు పచ్చని కూరల్లో ఎన్నో పోషకాలు.. ఔషధ గుణాలు ఉంటాయి.. అలాంటి ఆకుకూరల్లో.. మెంతికూర అద్భుతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. మెంతి ఆకులలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.. జీర్ణక్రియకు సహాయపడతాయి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. జీర్ణ సమస్యలతోపాటు.. మధుమేహం వంటి వాటిని నియంత్రించడంలో మెంతి ఆకులు సహాయపడతాయని పలు పరిశోధనలలో వెల్లడైంది.
మెంతులతోపాటు.. మెంతి ఆకులు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. వీటిని సాధారణంగా మెంతి కూరను సాధారణంగా కూరగాయగా ఉపయోగిస్తారు. అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. మెంతులు చేదుగా ఉన్నప్పటికీ, మెంతి ఆకులు మంచి రుచి కలిగి ఉంటాయి.. వీటిని పప్పుకూరగా, కూరగాయగా ఉపయోగిస్తారు. మెంతికూర పలు సమస్యలతో బాధపడుతున్న వారికి వరమేనని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. మెంతి ఆకులను రోజూ తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో.. తెలుసుకోండి..
జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి బరువును తగ్గిస్తుంది..
మెంతి ఆకులలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరచడంతోపాటు.. మలబద్దకం తగ్గేందుకు దోహదపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి వాటిని మెంతి ఆకులు తగ్గిస్తాయి. ఈ ఆకులను తింటే కడుపు నిండిన అనుభూతి కలిగి.. ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. కావున.. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
డయాబెటిస్ అదుపులో ఉంటుంది..
మెంతి ఆకులను తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే.. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యానికి..
మెంతి ఆకుల్లో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారు తరచూ మెంతి ఆకులను తింటే.. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
రోగ నిరోధక శక్తి ..
మెంతి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని సైతం మెరుగు పరుస్తాయి. దీంతో సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం నుంచి బయట పడవచ్చు.
మెంతి ఆకులను రసం తీసి తాగవచ్చు.. లేదా కూరగా అయినా వండుకుని తినవచ్చు.. ఇలా మెంతి ఆకులను తరచరూ తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








