Mehandi Designs: శుభకార్యాలకు నెలవు శ్రావణం.. అమ్మాయిల చేతులను అందమైన మెహందీ డిజైన్లతో అలంకరించుకోండి ఇలా
Mehandi Designs: లక్ష్మీప్రదమైన శ్రావణ మాసం వచ్చేసింది. శుభకార్యాలు, పూజలు, వ్రతాలు, పెళ్లిళ్లు, పేరంటాలకు ఈ మాసం పెట్టింది పేరు. ఈ పవిత్ర మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, గృహప్రవేశాలు, ప్రారంభోత్సవాలను జరుపుకోవడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ సందర్భంగా అమ్మాయిలు అందంగా రెడీ అవుతారు. ముఖ్యంగా చేతులను మెహందీ డిజైన్లతో అలంకరించుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు.. ఈరోజు విభిన్న మెహందీ డిజైన్ల గురించి అవి ఏ సందర్భంలో పెట్టుకుంటే బాగుంటుందో తెలుసుకుందాం.
Mehandi Designs 1
Follow us
గ్లిట్టర్ మెహందీ . ఇది విభిన్నంగా, స్టైలిష్గా కనిపిస్తుంది. ఈ గ్లిట్టర్ మెహందీ పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు మొదటి అప్షన్ గా చెప్పవచ్చు. మెహందీ అప్లై చేసిన తర్వాత, డిజైన్ మధ్యలో గ్లిట్టర్ ఉపయోగిస్తారు. దీంతో ఈ మెహందీ భిన్నంగా అందంగా కనిపిస్తుంది.
కొంతమంది మహిళలు సింపుల్ గా ఆకర్షణీయంగా ఉండే డిజైన్లను ఇష్టపడుతుంటారు. అలాంటివారి మొదటి ఛాయిస్ షేడెడ్ మెహందీ. తక్కువ సమయంలో ఈజీగా పెట్టుకోవచ్చు.. ముందుగా డిజైన్ ను గీతలుగా గీసి తర్వాత, లోపల షేడ్స్ ఇవ్వాలి. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
మెహందీని పెట్టుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించలేనివారికి పూల మెహందీ మంచి ఎంపిక. ఈ పూల మెహందీ చాలా అందంగా కనిపిస్తుంది. మెహందీ డిజైన్ పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఉత్తమ డిజైన్ కోసం మీరు ఇంటర్నెట్ సహాయాన్ని కూడా తీసుకోవచ్చు.
మెహందీని అరచేతి ఒక చివర నుండి మొదలుపెట్టి, చూపుడు వేలు చివరతో ముగించడాన్ని డయాగ్నల్ మెహందీ అంటారు. ఉద్యోగస్తులకు ఈ మెహందీ డిజైన్ మంచి ఎంపిక.