AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips for Men: మగవారి ముఖం దుమ్ము, ధూళి, టాన్‌తో పేరుకుని ఉందా.. ఈ సింపుల్ చిట్కాలను పాటించి చూడండి

Skin Care Tips for Men: అందంగా కనిపించాలని.. స్త్రీలేకాదు పురుషులు కూడా అనుకుంటారు.. అయితే గతంలో అందం కోసం మహిళలు తీసుకునే కేరింగ్ ను మగవారు తీసుకొనేవారు కాదు.. అయితే కాలంతో పాటు..

Beauty Tips for Men: మగవారి ముఖం దుమ్ము, ధూళి, టాన్‌తో పేరుకుని ఉందా.. ఈ సింపుల్ చిట్కాలను పాటించి చూడండి
Beauty Tips For Men
TV9 Telugu Digital Desk
| Edited By: Surya Kala|

Updated on: Jul 12, 2021 | 1:59 PM

Share

Beauty Tips for Men: అందంగా కనిపించాలని.. స్త్రీలేకాదు పురుషులు కూడా అనుకుంటారు.. అయితే గతంలో అందం కోసం మహిళలు తీసుకునే కేరింగ్ ను మగవారు తీసుకొనేవారు కాదు.. అయితే కాలంతో పాటు వచ్చిన మార్పుల్లో భాగంగా మగవారి ఆలోచనల్లో కూడా మార్పులు వచ్చాయి. . ఇక స్త్రీల చర్మం కంటే పురుషుల చర్మం కొంచెం రఫ్ గా కూడా ఉంటుంది. అందులో ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులు, దుమ్ము ధూళి, కాలుష్యం , అలవాట్లు ఇవన్నీ కలిసి పురుషుల చర్మంపై ప్రభావం చూపిస్తాయి. దీంతో మగవాళ్ళు కోసం మార్కెట్ లో అనేక రసాయనిక క్రీమ్ లు అనుబాటులోకి వచ్చాయి. రకరకాల క్రీమ్ లను ఉపయోగిస్తున్నారు. అయితే రసాయన క్రీమ్ లను వాడిదే బదులు పురుషులు కూడా చిన్న చిన్న చిట్కాలతో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.. ఈరోజు ఆ సింపుల్ చిట్కాల గురించి తెలుసుకుందాం..

* కొంచెం ఆలీవ్ ఆయిల్, ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ కాఫీ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని .. వీటిని బాగా కలపి ఈ మిశ్రమాన్ని ఫేస్ కు మృదువుగా అప్లై చేసి.. ఒక్క 15 నిముషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. రోజూ ఇలా చేస్తుంటే.. ఒక వరం రోజులకే రిజల్ట్ తెలుస్తుంది. మీ చర్మ కణాలు తొలగి.. చర్మం తాజాగా, మృదువుగా అవుతుంది.

*మొటిమలు ఇబ్బంది పెడుతుంటే.. వేపఆకులను పేస్ట్ ను తీసుకుని.. దానిలో గంధపు పొడి, బాదం పొడి, పసుపు పొడి వేసి బాగా కలిపి ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. ఈ మిశ్రమం తడిపొడిగా ఉన్న సమయంలోనే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అనంతరం ముఖం ప్రకాశవంతంగా, తాజాగా కనిపిస్తుంది.

*నిమ్మరసం సహజ సౌందర్య సాధనం.దీనిలో బ్లీచ్ లక్షణాలు ఉన్నాయి. కనుక ఇంట్లో ఉన్న సమయంలో ఫేస్ వాష్ బదులు నిమ్మ రసం తో ముఖం శుభ్రం చేసుకోవచ్చు.

*ముఖం పొడిబారుతుంటే.. నిమ్మరసంలో కొద్దిగా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని.. 15 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి.

*దుమ్ము ధూళి తొలగి.. తాజాగా ఉంచడానికి అనాస పండు కూడా ఉపయోగపడుతుంది. పైనాపిల్ ముక్కతో ముఖాన్ని రుద్ది తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

* పచ్చి బొప్పాయిని పేస్ట్‌ చేసుకుని ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి కొంచెం సేపు ఆరనివ్వాలి. అనంతరం కొంచెం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

* చర్మానికి ఆరోగ్యాన్ని ఇచ్చే పండు ఆరెంజ్. ఇది చర్మం రంగును మరింత పెంచుతుంది. ఆరెంజ్ రసంలో చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని కొంచెం సేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక 15 రోజులు చేస్తే.. రిజల్ట్ మీకే తెలుస్తుంది.

*చర్మానికి తేమ చాలా అవసరం. రోజూ నిద్రపోయే సమయానికి ముందు.. ఐస్ క్యూబ్ తీసుకొని ఒక 15 నిమిషాలు పాటు ముఖం పై రుద్దితే.. ముఖం కాంతి వంతంగా మారుతుంది.

ఇన్ని చిట్కాలతో పాటు సమయానికి తిండి.. తగినంత విశ్రాంతి.. కంటి సరిపడా నిద్రపోతే .. అందంగా ఆరోగ్యంగా జీవించవచ్చు.

Also Read:  వర్షాకాలంలో మాంసాహార ప్రియుల కోసం హాట్ అండ్ స్పైసీ చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారీ