Home Tips: ఇంట్లో ఎలకలు ఇబ్బంది పెడుతున్నాయా.. సహజమైన సింపుల్ చిట్కాలతో చెక్ చెప్పండి..

Home Tips For Women: ఎలుక వినాయక వాహనంగా పూజలను అందుకుంటున్న.. ఇంట్లో మాత్రం అది చేసే పనులతో మానవులకు సహజ  శత్రువుగా మారింది.  ఎలుకలు..

Home Tips: ఇంట్లో ఎలకలు ఇబ్బంది పెడుతున్నాయా.. సహజమైన సింపుల్ చిట్కాలతో చెక్ చెప్పండి..
Home Tips
Follow us
Surya Kala

|

Updated on: Oct 30, 2021 | 9:44 AM

Home Tips For Women: ఎలుక వినాయక వాహనంగా పూజలను అందుకుంటున్న.. ఇంట్లో మాత్రం అది చేసే పనులతో మానవులకు సహజ  శత్రువుగా మారింది.  ఎలుకలు ఎక్కడ ఉన్నా తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఇంట్లో ఉంటె చెక్కలను సైతం కొరికి వేస్తాయి, పండ్లు, కూరగాయలు వేటినీ మిగల్చవు.. ఇక రైతుకు ఎలుకలు తీవ్ర నష్టం కలుగజేస్తాయి. నిల్వ ఉంచిన ధాన్యం గాదెల్లో , పంట పొలాల్లో ఎలుకలు చేసే నష్టం గురించి తెలిసిందే. దీంతో ఇంట్లో ఎలుక ఉందంటే చాలు అవి తమకు హాని చేయకపోయినా భయపడతారు.

ముఖ్యంగా తన బలమైన పళ్లతో ఎలుకలు సృష్టించే విధ్వసం గురించి ఎంత చెప్పినా తక్కువే. దీంతో తమ ఇంటి నుంచి ఎలుకలను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తుంటారు. కొంతమంది మార్కెట్ లో దొరికే రసాయనిక మందులతో ఎలుకలను నివారించుకోవచ్చు అని ఆలోచిస్తారు. అయితే అటువంటి వాటితో సేడ్ ఎఫెక్ట్స్ కూడా ఎదుర్కొంటారు. ఈరోజు ఎలుకల నివారణ కోసం ఈ సింపుల్ చిట్కాలు తెలుసుకుందాం..

* ఎలుకలు కలరా ఉండలు ఉంచిన ప్లేస్ కు రావు. కలరా ఉండల నుంచి వచ్చే ఘాటు స్మెల్ తో ఎలుకలు అటువైపు దరిచేరవు.

*ఉల్లిపాయలు కూడా ఎలుకలకు చెక్ పెడతాయి. ఉల్లిపాయ నుంచి వెలువడే టాక్సిన్ వాసనకి ఎలుకలు ఆ ప్రదేశానికి దూరంగా ఉంటాయి.

*బిర్యానీ ఆకులు ఎలుకలు తిరిగే ప్రదేశంలో పెడితే.. ఆ స్మెల్ కు ఆ చుట్టుపక్కల ప్రదేశానికి ఎలుకలు రావు.

*ఘాటైన వాసన ఉండే పుదీనా నూనెలో దూది ముంచి.. ఎలుకలు ఉన్న ప్రదేశములో ఆ దూదేను పెడితే ఎలుకలు దరిచేరవు.

*లవంగాలు కూడా ఎలుకలను పారిపోయేలా చేస్తాయి. ఎలుకలు నివసించే కన్నం దగ్గర కొన్ని లవంగాలను క్లాత్ లో కట్టి పెడితే.. ఆ స్మెల్ కు ఎలుకలు పారిపోతాయి.

*ఎలుకలకు కారం అంటే మంట.. కారం ఉన్న చోట ఎలుకలు ఉండవు.. కనుక రంధ్రాలున్న చోట కారంవేసి ఓ చిన్న పాకెట్ లా చేసి.. పెడితే.. అవి మన ఇంటి నుంచి పారిపోతాయి.

Also Read:  అప్పు మరణ వార్త విని ఓ అభిమాని మృతి..బెంగళూరులో రేపటి వరకూ మద్యం అమ్మకాలపై అంక్షలు..