Summer Skin Care Tips : ఎండవేళ కందే ముఖానికి సహజమైన ఫేస్ ప్యాక్ అప్లై చేయండి ఇలా..!

వేసవి కాలం అడుగు పెట్టింది.. మే నెల రాకుండానే ఎండలు మండిస్తున్నాయి. వాతావరణంలో ఎటువంటి పరిస్థితులున్నా కొంతమందికి ఉద్యోగ నిర్వహణకోసమో.. ఇతర పనుల కోసమో ఎండల్లో తిరగడం తప్పదు..

Summer Skin Care Tips : ఎండవేళ కందే ముఖానికి సహజమైన ఫేస్ ప్యాక్ అప్లై చేయండి ఇలా..!
Summer Skin Care Tips
Follow us
Surya Kala

|

Updated on: Mar 15, 2021 | 3:29 PM

Summer Skin Care Tips : వేసవి కాలం అడుగు పెట్టింది.. మే నెల రాకుండానే ఎండలు మండిస్తున్నాయి. వాతావరణంలో ఎటువంటి పరిస్థితులున్నా కొంతమందికి ఉద్యోగ నిర్వహణకోసమో.. ఇతర పనుల కోసమో ఎండల్లో తిరగడం తప్పదు.. ఎండ వేడికి చర్మం కందిపోతుంది. ఇక స్కిన్ టోన్ కూడా మారిపోతుంది. అందుకని రోజు ఎండవేడి నుంచి రక్షణ కోసం రకరకాల రసాయనాలతో కూడిన లోషన్స్ వాడతాం.. అయితే ఇంట్లో ఉండే సహజమైన పదార్ధాలతో చిన్న చిన్న చిట్కాలతో మంచి అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.. ఈరోజు ఆ చిట్కాలను తెలుసుకుందాం..!

ముఖానికి ఇంట్లో సహజమైన ఫేస్ ప్యాక్ తయారీ :

ఒక గిన్నెలో పెరుగు, గంధం పొడి, టమాటో గుజ్జు కొంచెం కలబంద గుజ్జు కొంచెం వేసి వీటిని బాగా మిక్స్ చేయాలి. దీనిని ముఖానికి వేసుకునే ముందు పచ్చిపాలతో ఫేస్ క్లిన్ చేసుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తే.. ఎండ నుంచి రక్షణే కాదు.. ముఖానికి మెరుపు కూడా సంతరించుకుంటుంది.

కొంతమంది ఫేస్ రఫ్ గా ఉంటుంది అటువంటి వారి కోసం ఫేస్ ప్యాక్ :

అరచెక్క నిమ్మరసాన్ని ఒక గుడ్డు తెల్లసొనలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పది నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. అప్పుడు మృదువైన చర్మం సొంతం అవుతుంది.

టాన్ తొలగి ఫేస్ కాంతి వంతంగా కనిపించడం కోసం :

ఎండ వేడికి చర్మం పై ఏర్పడిన మచ్చలు ఏర్పడితే.. వాటి నివారణకు బొప్పాయి మంచిది. బొప్పాయి గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి రాస్తే చర్మం మెరుపు సంతరించుకుంటుంది. ఇక బొప్పాయి రసాన్ని రోజూ క్రమం తప్పకుండా ముఖానికి రాస్తే.. మంచి గ్లో వస్తుంది. ఇక తేనే బొప్పాయి రాసినా ఎండవల్ల కందిన చర్మం కాంతివంతంగా మారుతుంది.

మీది ఆయిల్ స్కిన్ అయితే వేసుకోవాల్సిన ఫేస్ ప్యాక్

ముందుగా ముఖాన్ని రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.. అనంతరం ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఓట్ మీల్, పాలు తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసుకున్న ముఖానికి అప్లై చేసుకోవాలి.. అనంతరం చేతివేళ్ళతో మృదువుగా మర్దనా చెయ్యాలి.. దీంతో చేతివేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. దీంతో మీ ఫేస్ పై ఉండే మృత కణాలు తొలగి. కళను సంతరించుకుంటుంది. ఇలా రోజుకి ఒక్కసారైనా చేయాలి

Also Read:

మొలలు, అజీర్తి, మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా..ఈ ఆసనం ఒక్కసారి ట్రై చేయండి

ఏపీలో తిరుగులేని వైసీపీ.. మరింతగా పడిపోయిన విపక్షాల బలం.. టీడీపీ ఓట్ల శాతంలో భారీ తరుగుదల