Threading Dangers: ఐబ్రో త్రెడ్డింగ్ చేయించుకుంటున్నారా? జాగ్రత్త..! ఆ సమస్యను కొని తెచ్చుకున్నట్టే!
ఈ మధ్య కాలంలో అందంగా కనిపించేందుకు అమ్మాయిలూ బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతున్నారు. రకరకాల బ్యూటీ ప్రాడక్ట్స్ వాడి తమ ముఖాన్ని అందంగా మార్చుకుంటున్నారు. కానీ ఈ అలవాట్లే వాళ్లకు సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఇలా బ్యూటీ ప్రాడక్ట్స్ వాడి కొందరు సమస్యలను కొని తెచ్చుంకుంటున్నారు. తాజాగా ఐబ్రో థ్రెడ్డింగ్ చేయించుకున్న ఓ యువతికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె ఐబ్రో థ్రెడ్డింగ్ చేయించుకున్న తర్వాత ఆమె కాలేయ వైఫల్యానికి గురైనట్లు తెలుస్తోంది.

అందంగా కనిపించాలనే ఆసక్తితో బ్యూటీ పాలర్‌కు వెళ్లిన ఒక యువతికి ఊహించని పరిణామం ఎదురైంది. బ్యూటీ పార్లలో ఐబ్రో త్రెడ్డింగ్ చేసుకున్న తర్వాత ఆమె కాలేయ వైఫల్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డాక్టర్ అదితిజ్ ధమిజా (MBBS) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చింది. డాక్టర్ ప్రకారం.. 28 ఏళ్ల ఓ యువతి ఐబ్రో థ్రెడ్డింగ్ కోసం స్థానిక సెలూన్‌లోకి వెళ్లింది, అక్కడ ఐబ్రో చేయించుకొని వెళ్లిన కొన్ని రోజు తర్వాత ఆమె తీవ్రమైన కాలేయ వైఫల్యానికి గురైంది. ఇందుకు కారణం ఐబ్రోస్ థ్రెండ్డింగ్ చేసేందుకు ఉపయోగించిన దారం అయి ఉండవచ్చని ఆమె పేర్కొంది.
వినడానికి ఇది వింతగా అనిపించినా ఇది నిజమయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఐబ్రో థ్రెడ్డింగ్ ద్వారా కాలేయానికి హాని కలిగించే వైరస్ నిజంగా సోకుతుందా? అనే విషయానికొస్తే.. అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణంగా పార్లర్‌లో సరైన పరిశుభ్రతను పాటించకపోవడమనే ఆరోపణలు ఉన్నాయి.
ఐబ్రో త్రెడ్డింగ్ వల్ల హెపటైటిస్ వస్తుందా?
సాంకేతికంగా, ఐబ్రో త్రెడ్డింగ్ వల్ల మీ కాలేయం దెబ్బతినదు. కానీ పార్లర్‌లో యూజ్ చేసే ఒకే థ్రెడ్‌ను అనేక కష్టమర్లకు యూజ్ చేసినప్పుడు లేదా ఒకరికి ఐబ్రో థ్రెడ్డింగ్ చేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోకపోవడం, అందుకోసం వాడే ఉపకరనాలకు శానిటైజ్ చేయకపోయినా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు థ్రెడ్డింగ్ సమయంలో చిన్న శరీరంపై చిన్న కోత పడిన లేదా రాపిడి జరిగినా.. హెపటైటిస్ బి లేదా సి వంటి రక్తం ద్వారా సంక్రమించే వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉందంటున్నారు.
ఈ వైరస్ లక్షణాలు
ఈ వైరస్‌లు లక్షణాల త్వరగా కనిపించవు అవి నిశ్శబ్దంగా శరీరంలోకి వెళ్లి, మీ కాలేయానికి నెమ్మదిగా హాని కలిగిస్తాయి. దీన్ని గుర్తించకుండా చికిత్స చేయించకుండా అలానే వదిలేస్తే దీర్ఘకాలిక హెపటైటిస్ కాలేయ వాపు, మచ్చలు (సిరోసిస్) లేదా అరుదైన సందర్భాల్లో, పూర్తిస్థాయి కాలేయ వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఈ వైరస్ మనకు సోకితే, కామెర్లు, కాలేయ వాపు ,దీర్ఘకాలిక హెపటైటిస్ , కాలేయ వైఫల్యం, తీవ్రమైన సందర్భాల్లో కాలేయ క్యాన్సర్ కూడా రావచ్చు.
థ్రెడింగ్ ద్వారా హెపటైటిస్ రాకుండా ఏం చేయాలి
- మీరు ఈ సారి ఐబ్రో త్రెడ్డింగ్ కోసం వెళ్లినప్పుడు వీటిని కచ్చితంగా గుర్తించుకోండి
- మీకు వాడే ఐబ్రో త్రెడ్డింగ్ కొత్తదో కాదో చూసుకోండి.. వాళ్లు ఇతరులకు వాడిందే మీకు వాడితే మార్చమని చెప్పండి, వాళ్లు కుదరదంటే అక్కడి నుంచి వెళ్లిపొండి
- మీకు ఐబ్రో చేసే వారు చేతులు శుభ్రంగా కడుకున్నారో లేదో చూడండి. మీకు వాడే వస్తువులకు శానిటైజ్ చేశారా లేదా పరిశీలించండి
- ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఐబ్రోస్ కోసం వాడే వాస్తువులను మీరే కొనుక్కొని తీసుకెళ్లండి, ఇవి మీకూ ఎప్పటికీ ఉపయోగపడొచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




