AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Cancer: కళ్లను కాటేస్తున్న క్యాన్సర్ మహమ్మారి.. ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు..

శరీరంలోని ఇతర భాగాలకు వచ్చినట్లే కళ్ళలో కూడా క్యాన్సర్ వస్తుందట. కంటి క్యాన్సర్‌ను సాధారణంగా కంటి మెలనోమా అని పిలుస్తారు. కంటి క్యాన్సర్ కంటిలోని ఏదైనా భాగంలో అభివృద్ధి చెందవచ్చు. ఇతర క్యాన్సర్ల మాదిరిగానే ఇది కూడా గుర్తించదగిన కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. కానీ దానిని ముందుగానే..

Eye Cancer: కళ్లను కాటేస్తున్న క్యాన్సర్ మహమ్మారి.. ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు..
Eye Cancer
Srilakshmi C
|

Updated on: May 18, 2025 | 12:19 PM

Share

కళ్లకు కూడా క్యాన్సర్ వస్తుందని మీకు తెలుసా? అవును.. మీరు సరిగ్గానే విన్నారు. శరీరంలోని ఇతర భాగాలకు వచ్చినట్లే కళ్ళలో కూడా క్యాన్సర్ వస్తుందట. కంటి క్యాన్సర్‌ను సాధారణంగా కంటి మెలనోమా అని పిలుస్తారు. కంటి క్యాన్సర్ కంటిలోని ఏదైనా భాగంలో అభివృద్ధి చెందవచ్చు. ఇతర క్యాన్సర్ల మాదిరిగానే ఇది కూడా గుర్తించదగిన కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. కానీ దానిని ముందుగానే గుర్తించాలి. మరి కళ్ళలో క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమిటి? కంటి క్యాన్సర్ లక్షణాలు ఏమిటి ? కంటి క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించగలదా? చికిత్స ఎలా ఉంటుంది? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

కళ్ల క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి?

కంటి క్యాన్సర్‌ను అరుదైన క్యాన్సర్‌గా చెప్పవచ్చు. కళ్లకు కూడా అనేక రకాల క్యాన్సర్లు సంభవించే అవకాశం ఉంది. వీటిలో ఒకటి కళ్ళలో కణితుల పెరుగుదల. ఈ కణితులు కళ్ళలోని కొన్ని భాగాలలో పెరుగుతాయి. కంటిలో అభివృద్ధి చెందే అన్ని కణితులు క్యాన్సర్ కానప్పటికీ.. వాటిని తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా కంటి క్యాన్సర్‌కు సకాలంలో చికిత్స చేయకపోతే అది శరీరం అంతటా వ్యాపిస్తుంది. కాబట్టి కళ్ళలో క్యాన్సర్ లక్షణాలను విస్మరించకూడదు. ప్రారంభ చికిత్స ద్వారా ఈ క్యాన్సర్ పెరగకుండా నిరోధించవచ్చు. కంటి క్యాన్సర్‌లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కంటి లేదా ఐరిస్ రంగు భాగంలో అభివృద్ధి చెందుతున్న ఐరిస్ మెలనోమా, కంటి లెన్స్‌లో అభివృద్ధి చెందుతున్న సిలియరీ బాడీ మెలనోమా, కంటి లైనింగ్‌లో ఏర్పడే కొరోయిడల్ మెలనోమా వంటివి ముఖ్యమైనవి. ఈ క్యాన్సర్ కొన్ని ప్రారంభ లక్షణాలు గుర్తించడానికి ముందే ఒంట్లో తిష్టవేస్తాయి. వీటిలో అస్పష్టమైన దృష్టి, కంటిపై మచ్చలు, కంటి చికాకు వంటి లక్షణాలు ముఖ్యమైనవి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకోవాలి.

ఎలా నివారించాలి? కళ్ళ శుభ్రత, భద్రతను ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. ప్రత్యక్ష సూర్యకాంతి నుంచి కళ్ళను రక్షించుకోవాలి. దుమ్ము, వాయు కాలుష్యానికి ఎక్కువసేపు గురికాకుండా కళ్లను కాపాడుకోవాలి. కళ్ళలో ఏదైనా అసౌకర్యం కనిపిస్తే, వెంటనే కంటి పరీక్ష చేయించుకోవాలి. మీ కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించడం మర్చిపోకండి. మనదేశంలో కంటి క్యాన్సర్ చాలా అరుదు. దీని ప్రాబల్యం 1% కంటే తక్కువ. కానీ దీన్ని విస్మరించడం మంచిది కాదు. బదులుగా దీని గురించి తెలుసుకుని అవగాహన పెంచుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.