Life Style: రిలేషన్ షిప్ లో ఇబ్బందులతో విసిగిపోయారా.. అతిగా ఆలోచించకుండా ఈ టిప్స్ పాటేంచేయండి..
సందేహం అనేది చాలా ప్రమాదకరమైనది. అది ఎలాంటి బంధాన్నైనా ఫట్ మని తుంచేస్తుంది. రిలేషన్‌షిప్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. భాగస్వామిపై అనుమానం ఏర్పడితే అది..
సందేహం అనేది చాలా ప్రమాదకరమైనది. అది ఎలాంటి బంధాన్నైనా ఫట్ మని తుంచేస్తుంది. రిలేషన్‌షిప్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. భాగస్వామిపై అనుమానం ఏర్పడితే అది భవిష్యత్ లో తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుంది. మనస్సులో సందేహం ప్రారంభమైనప్పుడు భాగస్వామి ప్రవర్తన, అలవాటును నెగిటివ్ గా చూడటం ప్రారంభమవుతుంది. ఫలితంగా ఇద్దరి మధ్య గొడవలు సర్వసాధారణమవుతుంటాయి. అటువంటి సందర్భాల్లో ఈ అలవాటును తొలగించుకోవడం ద్వారా దాంపత్య జీవితాన్ని ఆరోగ్యంగా చేసుకోవచ్చు. పచ్చని కాపురంలో అనుమానాలు తలెత్తకుండా నిపుణులు కొన్ని సూచనలు, చిట్కాలు చెబుతున్నారు. ఏదైనా విషయంలో అనుమానం తలెత్తితే భాగస్వామిని ప్రశ్నించే ముందు.. మీకు ఉన్న అనుమానాలు, గత అనుభవాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇవి కొన్ని సార్లు భవిష్యత్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ విషయంలో అలా కాకుండా చూసుకోవడం చాలా ముఖఅయం. మీ ఆలోచనలు, అవసరాలు, కోరికలను తెలియజేయడానికి కొంత సమయం కేటాయించాలి. అవసరమైతే మీ భాగస్వామి సహాయం తీసుకోవాలి. వారి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి.
మీ భాగస్వామితో కమ్యూనికేట్ చేయడం ద్వారా చాలా వరకు సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మనసు విప్పి మాట్లాడుకోవడం, దాపరికాలు లేకుండా అన్ని విషయాల గురించి చర్చించుకోవడం వంటివి చేయాలి. మీ భావాల గురించి భాగస్వామితో మాట్లాడాలి. ఆందోళనలకు కారణమయ్యే విషయాల పట్ల చర్చించాలి. ఘర్షణకు బదులుగా.. అనుమానం కలిగించే కారణాలను ప్రస్తావించాలి. వారితో నిజాయతీగా ఉండాలి. ముఖ్యంగా ఏ సంబంధమూ పరిపూర్ణంగా ఉండదని తెలుసుకోవాలసి. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన ఇబ్బందులు, లోపాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందరూ ఒకే మాట మీద ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. అలా కాకుండా ఆ విషయం పట్ల అందరూ చర్చించుకుని ఒకే అభిప్రాయం కలిగి ఉంటే సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
అతిగా ఆలోచించడం మానుకోవాలి. ఇలా చేయడం ద్వారా కోరికోరి ఇబ్బందులు తెచ్చుకున్నట్లే అవుతుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇప్పటికే ప్రతికూల ఆలోచన లేకుంటే అతిగా ఆలోచించడం వలన కాస్త ఉపశమనం పొందవచ్చు. అయినప్పటికీ అతి ఆలోచన అనేది మంచి అలవాటు కాదు. ఎందుకంటే ఇది ఒత్తిడి, ఆందోళన, ఉద్రిక్తతకు కారణమవుతుంది.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి