AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: అధికంగా చెమట వస్తోందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..

శరీరానికి అన్ని విటమిన్లు సరిగ్గా లభిస్తేనే ఆరోగ్యంగా ఉంటామని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ విటమిన్‌ లోపించే శరీరం వెంటనే మనల్ని అలర్ట్‌ చేస్తుంది. కొన్ని సంకేతాల ద్వారా విటమిన్‌ లోపాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. శరీరానికి ఎంతో మేలు చేసే విటమిన్స్‌లో విటమిన్‌ డీ ఒకటి. ఎముకల ఆరోగ్యం మొదలు మానసిక ఆరోగ్యం వరకు అన్నింటిలో...

Health: అధికంగా చెమట వస్తోందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
Sweat
Narender Vaitla
|

Updated on: Aug 08, 2024 | 8:47 PM

Share

శరీరానికి అన్ని విటమిన్లు సరిగ్గా లభిస్తేనే ఆరోగ్యంగా ఉంటామని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ విటమిన్‌ లోపించే శరీరం వెంటనే మనల్ని అలర్ట్‌ చేస్తుంది. కొన్ని సంకేతాల ద్వారా విటమిన్‌ లోపాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. శరీరానికి ఎంతో మేలు చేసే విటమిన్స్‌లో విటమిన్‌ డీ ఒకటి. ఎముకల ఆరోగ్యం మొదలు మానసిక ఆరోగ్యం వరకు అన్నింటిలో విటమిన్‌ డీ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్‌ డీ లోపిస్తే కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ విమిన్‌ డీ లోపం కారణంగా వచ్చే కనిపించే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* చెమట పట్టడం అనేది సహజమైన ప్రక్రియ అని తెలిసిందే. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడంలో చెమట కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో కూడా చెమట కీలక పాత్ర పోషిస్తుంది. అయితే సాధారణంగా వాతావరణం వేడిగా ఉంటేనో, శారీరక శ్రమ ఎక్కువగా చేస్తేనో చెమటపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో విటమిన్‌ డి లోపం వల్ల కూడా చెమట పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని హైపర్ హైడ్రోసిస్‌గా పిలుస్తారు.

* విటమి్‌ డీ శరీరంలో శక్తి స్థాయిలను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల నిద్రపోయిన తర్వాత కూడా అలసటగా ఉంటుంది. ఇది దీర్ఘకాలంగా కొనసాగితే మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.

* కండరాల బలహీనత సమస్య వేధిస్తున్నా అది కూడా విటమిన్‌ లోపంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. విటమిన్‌ డీ లోపం కండరాల బలహీనతకు కారణమవుతుంది.

* విటమిన్‌ డీని “సన్‌షైన్ విటమిన్” అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది మన మానసిక స్థితిని నియంత్రించే హార్మోన్. విటమిన్‌ డీ లోపం ఈ విటమిన్ యొక్క లోపం మానసిక కల్లోలం, నిరాశకు కారణమవుతుంది.

* విటమిన్‌ డీ అనగానే గుర్తొచ్చేది ఎముకల ఆరోగ్యం. ఎముకలకు అవసరమైన కాల్షియం, ఫాస్పరస్ శోషణలో సహాయపడుతుంది. విటమిన్ డి లోపం కారంగా ఎముకలు బలహీనంగా మారుతాయి. బోలు కుమలక వ్యాధి వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.

* అకారణంగా జుట్టు రాలుతోన్నా విటమిన్‌ డీ లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ విటమిన్‌ లోపం కారణంగా జుట్టు రాలడం లేదా పల్చనబడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటిచండమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..