AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt: ఉప్పు తక్కువగా తీసుకుంటే మిరాకిల్‌.. ఆ సమస్యకు కూడా చెక్‌..

ఉప్పు లేనిది రోజు గడవదని తెలిసిందే. ప్రతీ వంటకంలో కచ్చితంగా ఉప్పు ఉండాల్సిందే. ఉప్పు లేని వంటకాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. అయితే వంటకానికి రుచిని ఇచ్చే ఉప్పు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ మొదలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి...

Salt: ఉప్పు తక్కువగా తీసుకుంటే మిరాకిల్‌.. ఆ సమస్యకు కూడా చెక్‌..
Salt
Narender Vaitla
|

Updated on: Aug 08, 2024 | 10:05 PM

Share

ఉప్పు లేనిది రోజు గడవదని తెలిసిందే. ప్రతీ వంటకంలో కచ్చితంగా ఉప్పు ఉండాల్సిందే. ఉప్పు లేని వంటకాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. అయితే వంటకానికి రుచిని ఇచ్చే ఉప్పు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ మొదలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని తెలిసిందే. హృదయ సంబంధిత సమస్యలకు కూడా ఉప్పు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఉప్పును క్రమంగా తగ్గించడం వల్ల ఎన్నో వ్యాధులకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతుంటారు. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఉప్పు విషయంలో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశాయి. అయితే ఉప్పు తక్కువగా తీసుకోవడం మరో ప్రయోజనం కూడా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కిడ్నీ సమస్యల బారిన పడి కోలుకుంటున్న వారికి ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నివేదికల్లో తేల్లింది. అమెరికాకు చెందిన పరిశోధకుల బృందం ఎలుకలపై నిర్వహించిన అధ్యాయనం అనంతరం ఈ విషయాలను వెల్లడించారు.

స్వల్పకాలంలో ఉప్పు తక్కువ ఆహారం తినటం, శరీరంలో ద్రవాల మోతాదులు తగ్గించటం ద్వారా ఎలుకల కిడ్నీలోని కొన్ని కణాలు మరమ్మత్తు అవుతున్నట్టు, పునరుజ్జీవం పొందుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. కిడ్నీలోని మాక్యూలా డెన్సా అనే భాగంలోని కణాలు ఇందుకు దోహదం చేస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ కణాలు ఉప్పును గుర్తించటం, రక్తం వడపోత, హార్మోన్ల విడుదల వంటి కీలకమైన పనులను పర్యవేక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల దెబ్బతిన్న కిడ్నీ కణాల పునరుజ్జీవంలో గణనీయమైన పాత్ర పోషిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.

కిడ్నీ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే ఉద్దేశంతో యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాలోని కెక్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన జానోస్‌ పెటి-పెటెర్డి టీమ్‌ పరిశోధనలు చేపట్టింది. ఇందులో భాగంగానే కిడ్నీలు ఎలా పరిణామం చెందాయో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎలుకలకు రెండు వారాల పాటు తక్కువ ఉప్పు ఆహారం.. అలాగే ఉప్పు, ద్రవాలను మరింత తగ్గించే ఏసీఈ ఇన్‌హిబిటార్‌ రకం మందులు ఇచ్చారు. దీంతో మాక్యులా డెన్సా కణాల పునరుజ్జీవం మొదలైనట్లు గుర్తించారు. మొత్తం మీద ఉప్పు తక్కువగా తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం కూడా మెరుగువుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..