Weight Lose: బరువు తగ్గడం అంత ఈజీ కాదని అందరికి తెలుసు..! కానీ ఈ 5 విషయాలు తెలుసుకుంటే మంచిది..
Weight Lose: బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. ఎంతో కష్టపడితే కానీ అది సాధ్యం కాదు. ప్రతిరోజు మీరు ఎంత కొవ్వును బర్న్ చేస్తారనే దానిపై బరువు
Weight Lose: బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. ఎంతో కష్టపడితే కానీ అది సాధ్యం కాదు. ప్రతిరోజు మీరు ఎంత కొవ్వును బర్న్ చేస్తారనే దానిపై బరువు తగ్గడం ఆధారపడి ఉంటుంది. మీరు తినే ఆహారాలు, ఎంచుకున్న పానీయాలు, అన్నీ మిమ్మల్ని వెంటాడుతాయి. అయితే బరువు తగ్గడానికి సులువైన మార్గాలు ఉన్నాయి. ముందుగా ఇవి తెలుసుకోవాలి. అవేంటో ఒక్కసారి చూద్దాం.
1. సరైన ఆహారాన్ని ఎంచుకోండి మీరు బరువు తగ్గించే ప్రయత్నంలో ఉన్నప్పుడు సరైనా ఆహారాన్ని ఎంచుకోవాలి. అజాగ్రత్తగా తింటే మరింత బరువు పెరుగుతారు. తర్వాత చాలా బాధపడుతారు. కచ్చితంగా ఆరోగ్యకరమైన డైట్ ఫాలోకావాల్సిందే. సరైన కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి, ఆరోగ్యకరమైన కొవ్వులకు మారండి. తాజా కూరగాయలు, పండ్లను తినండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు డైట్‌లో ఉండాలి. ఎందుకంటే ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరంగా ఉంచుతుంది.
2. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు తినవద్దు.. బరువు తగ్గాలని నిర్ణయించుకున్నప్పుడు పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినవద్దు. అలాగని మొత్తం తినకుండా ఉండవద్దు. మంచి పదార్థాలను ఎంచుకొని తినవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు, అనారోగ్యకరమైన కొవ్వుల మధ్య తేడా తెలుసుకోవాలి. కార్బోహైడ్రేట్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు సంతృప్తికరంగా ఉంచుతుంది. మీ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
3. పుష్కలంగా నీరు త్రాగండి హైడ్రేటెడ్‌గా ఉండటం కోసం పుష్కలంగా నీరు తాగాలి. వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడడంలో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తీవ్రమైన వైద్య పరిస్థితులకు దారితీసే సమస్యలను నివారిస్తుంది. పొట్ట నిండుగా ఉండి ఎక్కువ ఆహారం తినకుండా చేస్తుంది.
4. శారీరక శ్రమ బరువు తగ్గాలంటే శారీరక శ్రమ చాలా ముఖ్యం. మీరు తిన్నదానికి, శ్రమకు మధ్య సమతుల్యత ఉండాలి. వ్యాయామం కచ్చితంగా కొనసాగించాలి. అప్పుడే రోగాల నుంచి బయటపడుతారు. ఆహారం గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
5. రుచికరమైన స్నాక్స్ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొంతమంది స్నాక్స్‌ని అవైడ్ చేస్తారు. ఇది మంచి పద్దతి కాదు. కొన్ని రకాల స్నాక్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు, మాంస కృత్తులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన స్నాక్స్‌లో గింజలు, పాప్‌కార్న్, బెర్రీలు, ధాన్యపు ఆహారాలు, వెజ్జీ సలాడ్‌లు ఉండేలా చూసుకోవాలి.