Lunch Box: వేసవిలో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? జర భద్రం..
వేసవిలో ఆహారం త్వరగా పాడైపోతుంది. ముఖ్యంగా ఈ కాలంలో స్నాక్స్ లేదా లంచ్ బాక్స్‌లు ప్యాక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇది ఖచ్చితంగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆలస్యమైందని ఆఫీసుకి లేదా కాలేజీకి వేడి ఆహారాన్ని బాక్స్‌లో కుక్కి పరుగులు తీయడం సరికాదు..

వేసవిలో ఆహారం త్వరగా పాడైపోతుంది. ముఖ్యంగా ఈ కాలంలో స్నాక్స్ లేదా లంచ్ బాక్స్‌లు ప్యాక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇది ఖచ్చితంగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆలస్యమైందని ఆఫీసుకి లేదా కాలేజీకి వేడి ఆహారాన్ని బాక్స్‌లో కుక్కి తీసుకెళ్లడం సరికాదు. ఇలా చేస్తే వేసవిలో ఆహారం త్వరగా పాడైపోతుంది. మీరు ఇలాగే చేస్తూ ఉంటే మీ పద్ధతి మార్చుకోండి. ఈ కింది సాధారణ నియమాలను పాటించారంటే వేసవిలో కూడా మీ మధ్యాహ్న భోజనాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎలాగంటే..
తాజా పండ్లు, టమోటాలు, దోసకాయలు, ఆకుకూరలు వంటి కొన్ని ఆహారాలు త్వరగా చెడిపోతాయి. కాబట్టి మధ్యాహ్న భోజనానికి ఎక్కువసేపు తాజాగా ఉండే ఆహారాన్ని తీసుకెళ్లడం బెటర్. వీటికి బదులుగా మధ్యాహ్న భోజనంలో రోటీ, పప్పు, అన్నం, శాండ్‌విచ్‌లు తినవచ్చు. మీ ఆఫీసులో రిఫ్రిజిరేటర్ ఉంటే అందులో ఆహారాన్ని భద్రపరచుకోవచ్చు. ఇది ఆహారం త్వరగా చెడిపోకుండా నిరోధిస్తుంది. వేసవిలో మీ ఆహారాన్ని సురక్షితంగా ఉంచడానికి గాలి చొరబడని బాక్స్‌లను ఉపయోగించాలి. ఇది ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. అటువంటి లంచ్ బాక్స్‌లో మధ్యాహ్న భోజనాన్ని ఉంచడం వల్ల అది తాజాగా ఉండటమే కాకుండా, ఆహారం రుచిని కాపాడటానికి కూడా సహాయపడుతుంది.
అలాగే వేసవిలో వంట చేసేటప్పుడు, శరీరానికి వేడి చేసే మసాలా దినుసులు ఉపయోగించకపోవడమే మంచిది. ఎక్కువ మసాలాతో తయారుచేసిన ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. అవి వేడికి త్వరగా చెడిపోతాయి. అటువంటి ఆహారాలను తేలికపాటి మసాలా దినుసులతో తయారు చేయాలి. తద్వారా అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఉదయం అందరూ ఆఫీసుకి వెళ్ళే తొందరలో ఉంటారు. ఈ సమయంలో వేడి ఆహారాన్ని ప్యాక్ చేసుకోకూడదు. ఆహారం చెడిపోకుండా ఉండాలంటే ముందే కొద్దిగా చల్లబరచాలి. ఆ తర్వాత బాక్స్‌లో ప్యాక్ చేయాలి. చాలా మంది రాత్రిపూట తయారుచేసిన ఆహారాన్ని ఉదయం ఆఫీస్‌కి తీసుకెళ్తుంటారు. కానీ దీనికి దూరంగా ఉండాలి. ఈ రకమైన ఆహారాలు ముఖ్యంగా వేసవిలో త్వరగా చెడిపోతాయి. కాబట్టి ఉదయం ఉడికించిన ఆహారం మాత్రమే మధ్యాహ్నం వరకు తాజాగా ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




