White Rice: అన్నం పరబ్రహ్మ స్వరూపం.. మరీ రోజూ తినడం లాభమా.. నష్టమా? వివరాలు తెలుసుకోండి..
కొందరు రెండు పూటలు, కొందరు మూడు పూటలా అన్నం తినేవాళ్లు ఉన్నారు. అయితే అతిగా అన్నం తినడం అనారోగ్య దాయకమని నిపుణులు చెబుతున్నారు. తగు మోతాదులోనే అన్నం తినాలని సూచిస్తున్నారు.

ఆరోగ్యాన్ని పెంపొందించడానికి వరి అన్నం తగ్గించండి అని అందరూ చెబుతుంటారు. కానీ మనకు రెండు ముద్దలైన తెల్ల అన్నం లేకపోతే ఆ పూట ఏమి తిన్నట్టు ఉండదు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వరి అన్నం ఎక్కువగా తీసుకుంటారు. కొందరు రెండు పూటలు, కొందరు మూడు పూటలా అన్నం తినేవాళ్లు ఉన్నారు. అయితే అతిగా అన్నం తినడం అనారోగ్య దాయకమని నిపుణులు చెబుతున్నారు. తగు మోతాదులోనే అన్నం తినాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అన్నం ఎంత తినాలి? ఎక్కువ తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అసలు తినడం మానేస్తే ఏమవుతుంది? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మంచి, చెడు రెండూ..
అన్నం తినడం వల్ల మంచి, చెడు రెండూ ఉంటాయి. అన్నం తింటే బరువు పెరుగుతారని, మధుమేహం వస్తుందని చెబుతుంటారు. విటమిన్లు, ఖనిజాలు తక్కువగా ఉన్నందున వైట్ రైస్ తినడం చాలా ప్రమాదకరం. బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్‌ను పెంచుతుంది. శరీరంలోకి చేరిన కార్బోహైడ్రేట్‌లను ఎంత త్వరగా చక్కెరగా మార్చవచ్చో కొలవడానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉపయోగపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు ఎల్లప్పుడూ ఉత్తమమైనవి. బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ 64. అందుకే, బియ్యం ఎక్కువగా టైప్ 2 డయాబెటిస్‌కు కారణమవుతాయి.
అంతేకాకుండా, బియ్యం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం కూడా ఉంది. అంతే కాకుండా రోజూ అన్నం తినే వారికి రక్తపోటు ముప్పు చాలా ఎక్కువట. లేదంటే ఉపవాస సమయంలో మధుమేహం పెరిగిపోయి శరీరంలో ట్రైగ్లిజరైడ్లు పెరిగే అవకాశం ఉంది. ఇది నడుము చుట్టుకొలతను పెంచుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమంగా తగ్గిస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి?
అన్నం రోజూ తినడం వల్ల రైస్ ఎలర్జీ వస్తుంది. కానీ చాలా అరుదుగా వస్తుంది. ఇది కూడా గోధుమ, గ్లూటెన్ అలర్జీల మాదిరిగానే ఉంటుంది. దీని లక్షణాలు కూడా అవే ఉంటాయి. అలాగే అధిక మోతాదులో అన్నం తింటే కడుపు ఉబ్బురం సమస్య తలెత్తుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. దాని విధులకు ఈ అన్నం ఆటంకం కలిగిస్తుంది.
ఎంత మోతాదులో అన్నం తినాలి..
రైస్ అన్నంలో కార్భోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం కప్పు బియ్యంను వండుకొని తింటే సరిపోతుంది.అంటే ప్రతి రోజూ 70 నుంచి 90 గ్రాముల బియ్యం చాలు. దీనిని కూరగాయలు, పప్పులు, ప్రోటీన్లు అందించే ఇతర వాటితో కలిపి తీసుకోవచ్చు. అలాగే ఫైబర్ కంటెంట్, కాంప్లెక్స్ కార్భోహైడ్రేట్లు అధికంగా ఉండే ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా పెంచవలసి ఉంటుంది. అప్పుడు డైట్ బ్యాలెన్స్ అవుతుంది. ఆకలిని తగ్గిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..