Summer Fruits: ఈ ఫ్రూట్స్ తిన్నారంటే వేసవిలో ఎలాంటి సమస్యలు దరిచేరవు!

ప్రస్తుతం ఎండలు అల్లాడిస్తున్నాయి. ఇతర కాలాల కంటే వేసవి కాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎండ వేడి, ఉక్కపోత కారణంగా డీహైడ్రేషన్‌కి ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఎండ నుంచి ఉపశమనం అందించే ఆహారాలు తీసుకోవాలి. వీటిల్లో పండ్లు చాలా బెస్ట్. పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఎండాకాలంలో కొన్ని రకాల పండ్లు..

Summer Fruits: ఈ ఫ్రూట్స్ తిన్నారంటే వేసవిలో ఎలాంటి సమస్యలు దరిచేరవు!
Summer Fruits
Follow us

|

Updated on: May 14, 2024 | 1:47 PM

ప్రస్తుతం ఎండలు అల్లాడిస్తున్నాయి. ఇతర కాలాల కంటే వేసవి కాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎండ వేడి, ఉక్కపోత కారణంగా డీహైడ్రేషన్‌కి ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఎండ నుంచి ఉపశమనం అందించే ఆహారాలు తీసుకోవాలి. వీటిల్లో పండ్లు చాలా బెస్ట్. పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఎండాకాలంలో కొన్ని రకాల పండ్లు ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఉండే కొన్ని పండ్లు మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. శరీరానికి పోషకాలు అందడంతో పాటు.. వేసవి వేడి నుంచి కూడా ఉపశమనం పొందుతారు. వేసవిలో సాధారణంగా పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పుచ్చకాయతో పాటు ఇప్పుడు చెప్పబోయే పండ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి. మరి ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పైనాపిల్:

పైనాపిల్‌లో కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఖనిజాలతో పాటు నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి పైనాపిల్ తినడం వల్ల అలసట, నీరసం రాకుండా.. డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు.

ఖర్భూజ:

వేసవిలో మర్చిపోకుండా తినాల్సిన పండ్ల లిస్టులో ఖర్భూజ కూడా ఒకటి. ఇందులో నీటి శాతంతో పాటు ఇతర పోషకాలు కూడా మెండుగా లభిస్తాయి. ఈ పండు తిన్నా, జ్యూస్ తాగినా శరీరాన్ని చల్లబరుస్తుంది. కాబట్టి ఈ పండు తినడం అస్సలు మర్చిపోవద్దు.

ఇవి కూడా చదవండి

తాటి ముంజలు:

వేసవి తాపాన్ని పోగొట్టే వాటిల్లో తాటి ముంజలు ముందుంటాయి. వీటి ధర కూడా చాలా తక్కువ. వీటిని పిల్లలు కూడా ఇష్ట పడి మరీ తింటారు. వీటిని చెమటకాయలు ఉన్నచోట రాస్తే.. మంచి ఉపశమనం లభిస్తుంది. ఇవి తినడం వల్ల తక్షణమే శక్తి లభించడమే కాకుండా హాయిగా ఉంటుంది.

నేరేడు పండ్లు:

సమ్మర్‌లో నేరేడు పండ్లు కూడా విరివిగా లభిస్తాయి. అందులోనూ ఇవి సీజనల్ ఫ్రూట్ కాబట్టి.. వీటిని కూడా మర్చిపోకుండా తినడం మంచిది. వీటిల్లో కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు, నీటి శాతంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటిని తినడం వల్ల కూడా శరీరం చల్ల బడటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన