Chicken: చికెన్ తింటే జలుబు తగ్గుతుందా.. వెంటనే రిలీఫ్ అవ్వాలంటే ఇలా చేయండి!
చలి కాలంలో ఎక్కువగా ఎటాక్ చేసే సమస్యల్లో జలుబు కూడా ఒకటి. జలుబు కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. జలుబు త్వరగా తగ్గాలంటే చాలా మంది చికెన్ తింటారు.. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలుసుకుందాం..
జలుబు ఒక్కసారి వచ్చిందంటే అంత తేలిగ్గా తగ్గదు. జలుబు ఎక్కువగా ఉంటే జ్వరం, దగ్గు కూడా వస్తాయి. కాబట్టి జలుబును ముందుగానే తగ్గించుకోవాలి. జలుబు చేస్తే ఎలాంటి పనులు కూడా త్వరగా చేసుకోలేం. ముక్కు కారుతూ ఉంటే.. బయట పనులు చేసేందుకు ఇబ్బందిగా ఉంటుంది. మరికొంత మందికి ఎక్కువగా కఫం పట్టేస్తుంది. ఇది అంత తేలిగ్గా తగ్గదు. శరీరంలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు కూడా జలుబు చేస్తుంది. జలుబు తగ్గాలంటే చికెన్ తింటే సరిపోతుందని.. మసాలాలు దట్టించి కాస్త స్పైసీగా తింటూ ఉంటారు. మరి చికెన్ తింటే నిజంగానే జలుబు తగ్గుతుందా? జలుబు తగ్గించే గుణాలు చికెన్‌లో ఉన్నాయా? జలుబు నుంచి వెంటనే రిలీఫ్ పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ తింటే జలుబు తగ్గుతుందా?
జలుబు తగ్గేందుకు చికెన్‌ని కాస్త ఘాటుగా వండుకుని తింటూ ఉంటారు. ఇది ఏళ్ల నుంచి చాలా మంది పాటిస్తూ ఉంటారు. చికెన్ సూప్ కూడా తాగుతూ ఉంటారు. చికెన్ మంచి ఎనర్జీని పెంచుతుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. కేవలం చికెన్ తింటేనే జలుబు తగ్గదు. అందులో వాడే మసాలాల కారణంగా జలుబును అనేది త్వరగా తగ్గుతుంది. కాబట్టి ఇది చాలా వరకు ఫ్రూవ్ అవుతుంది. చికెన్ తిని ఎంతో మంది జలుబు నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే మసాలాలు వేసి లైట్‌గా సూప్‌గా తాగితే జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది. చికెన్ లేకుండా కూరగాయలు, మసాలాలు జోడించి కూడా సూప్ తయారు చేసుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది.
పసుపు పాలు:
పసుపు పాలు తాగడం వల్ల త్వరగా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు.. జలుబుతో పోరాడుతాయి. శరీరంలో కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
మిరియాల పాలు:
మిరియాలు వేసి కాచిన పాలు తాగినా కూడా జలుబు నుంచి త్వరగా రిలీఫ్ పొందవచ్చు. చలి కాలంలో అప్పుడప్పుడూ ఈ పాలు తాగితే త్వరగా జలుబు ఎటాక్ కాకుండా ఉంటుంది. త్వరగా జలుబు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.