Salt: వామ్మో.. ఉప్పు అతిగా తినే వారికి అలెర్ట్! ఈ ప్రమాదకర వ్యాధి రావచ్చు..
ఉప్పు వాడకం వలన ప్రమాదకరమైన డేంజరస్ వ్యాధి వచ్చే అవకాశలు ఉన్నాయని ఇటీవల చేసిన పలు అధ్యయనాల్లో తేలింది. ఉప్పు తింటే గుండె, కాలేయం, మూత్ర పిండాల సమస్యలే కాకుండా పొట్ట క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందట..
ఉప్పు లేని వంట చెత్త తిన్నట్టే అని భారతీయులు అంటూ ఉంటారు. ఉప్పు లేనిదే కూర రుచి కూడా ఉండదు. వంటల్లో ఉప్పు తప్పని సరి అయిపోయింది. ఇప్పటికే ఉప్పును ఎక్కువగా తినడం వల్ల రక్త పోటు వంటి సమస్యలు వస్తున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రుచిని పెంచుతుందని ఉప్పును ఎక్కువా వాడితే తిప్పలు తప్పవు. కాలేయం, మూత్ర పిండాలు కూడా దెబ్బతింటాయి. అయితే తాజాగా చేసిన పలు పరిశోధనల్లో మాత్రం.. ప్రమాదకర వ్యాధి అయిన క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని తేలింది. ఉప్పు తింటే గుండె, మూత్ర పిండాలకు చాలా నష్టం జరుగుతుందన్న విషయం తెలిసిందే. కానీ ఉప్పు అతి వాడకం వలన స్టమక్ క్యాన్సర్, గ్యాస్టిక్ క్యాన్సర్ వస్తుందని ఇటీవల చేసిన అధ్యయానల్లో హెచ్చరించారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుతం ఈ విషయం ప్రజలను మరింత ఆందోళనల్లోకి తీసుకెళ్లింది.
అనేక మందిపై పరిశోధనలు..
బ్రిటన్‌లో చేపట్టిన ఓ పరిశోధన సంస్థ.. ఉప్పు ఎక్కువగా తింటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు రావడానికి అవకాశం ఉందని వెల్లడించింది. దాదాపు 4,70 వేల మంది ఆహార అలవాట్లను పరిశీలించగా.. ఈ అధ్యయనంలో ఉప్పు ఎక్కువగా తినే వారిలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయతే ఏ మోతాదులో ఉపయోగిస్తే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయన్న విషయంపై ఇంకా పరిశోధిస్తున్నారు. అంతే కాకుండా గ్యాస్ట్రిక్ సమస్యకు కేవలం ఉప్పు మాత్రమే కాకుండా.. ఇంకా అనేక కారణాలు ఉన్నట్లు తేలిందని చెప్పారు. కేవలం ఉప్పు తింటేనే పొట్ట క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తాము చేప్పడం లేదని తెలిపారు.
తగ్గించి తీసుకోవడం మేలు..
ఉప్పు అధికంగా లభించే వాటిల్లో జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో వండే ఆహారాల్లో కూడా ఉప్పును తగ్గించి వాడాలి. సాధారణ తెల్ల ఉప్పుకు బదులు.. పింక్ సాల్ట్ వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు తగ్గించి తీసుకోవడం వల్ల అనేక సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.