AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi air Pollution: పెరుగుతున్న కాలుష్యం.. ఈ మూడు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్న ఢిల్లీ వాసులు..

దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకీ కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో గ్రేప్-3 ఢిల్లీ-NCR లో అమలు చేయబడింది. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ఇది అమలు చేయబడింది. ఈ కాలుష్యం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఢిల్లీలో PM 2.5 స్థాయి 300 కంటే ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, PM 2.5 స్థాయి 100 కంటే ఎక్కువ ఉంటే. ఆ వాతావరణం ప్రమాదకరమైన వ్యాధులను కలిగిస్తుందని నిపుణులు చెప్పారు.

Delhi air Pollution: పెరుగుతున్న కాలుష్యం.. ఈ మూడు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్న ఢిల్లీ వాసులు..
Delhi Air Pollution
Surya Kala
|

Updated on: Nov 15, 2024 | 3:52 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. కాలుష్యం కారణంగా గ్రూప్ 3 నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ నిబంధనలు అమల్లోకి తీసుకుని వచ్చారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలోని కొన్ని పరిసర ప్రాంతాల్లో AQI 500 మించి ఉంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఢిల్లీలో PM 2.5 స్థాయి కూడా 300 కంటే ఎక్కువగానే ఉంది. PM2.5 (పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5) గాలిలో ఉండే చాలా చిన్న కణాలు.. వీటి పరిమాణం 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. ఈ కణాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణం.. అంతేకాదు ఇవి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం

300 PM2.5 కంటే ఎక్కువ స్థాయి ఉంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని కారణంగా ప్రజలు ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), న్యుమోనియా వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు కాలుష్యం గుండెపోటు, క్యాన్సర్, నరాల సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. ఈ రకమైన కాలుష్యంలో నివసించే వ్యక్తులు సులభంగా మూడు తీవ్రమైన వ్యాధుల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్థాయి కాలుష్యం క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులతో బాధపడుతున్న రోగుల సంఖ్యను పెంచుతుందని చెబుతున్నారు.

కాలుష్యం వల్ల ఏ ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయంటే..

ఢిల్లీ AIIMSలో పల్మోనాలజీ, క్రిటికల్ కేర్ , స్లీప్ మెడిసిన్ విభాగం మాజీ HOD ఖిలానీ మాట్లాడుతూ.. కాలుష్యంలో ఉండే చిన్న చిన్న కణాలు ఊపిరి తీసుకునే సమయంలో శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి రక్తాన్ని చేరుకుంటాయని వివరించారు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. అంతేకాదు ఏదైనా ప్రాంతంలో PM 2.5 స్థాయి ఎక్కువ కాలం 100 కంటే ఎక్కువగా ఉంటే అది ప్రాణాంతకం కావచ్చని అన్నారు. ఇలాంటి గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, ఉబ్బసం వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. చలి, కాలుష్యం కారణంగా గుండెపోటు కేసులు 25 శాతం పెరుగుతాయని ఎయిమ్స్ పరిశోధనలు కూడా చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కాలుష్యం కారణంగా ప్రజలు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారు. ధూమపానం అలవాటు లేకపోయినా చాలా మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నట్లు హెచ్చరించారు. దీనికి కారణం కాలుష్యం. ఢిల్లీలో AQI , PM 2.5 స్థాయిలు రెండూ ప్రమాదకరంగా ఉన్నాయని డాక్టర్ ఖిల్నాని చెప్పారు. అటువంటి పరిస్థితిలో ఈ మూడు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగుల ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

కాలుష్యం నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలంటే

  1. అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లండి
  2. బయటకు వెళ్ళే సమయంలో తప్పని సరిగా N-95 మాస్క్ ధరించండి
  3. దుమ్ము , ధూళిని నివారించండి
  4. ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి